EX Mla Rajayya: మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఢీకొని మహిళ మృతి!

బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది.హనుమకొండ మడికొండకు చెందిన స్వప్న (40) ఎస్సీ కాలనీ వద్ద రోడ్డు దాటుతుండగా రాజయ్య కారు ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

New Update
EX Mla Rajayya: మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఢీకొని మహిళ మృతి!

Ex Mla: బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండలో జరిగింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మడికొండకు చెందిన స్వప్న (40) ఎస్సీ కాలనీ వద్ద శనివారం రాత్రి డివైడర్ల మధ్య నుంచి రోడ్డును దాటుతుండగా..హైదరాబాద్‌ నుంచి హనుమకొండకు వెళ్తున్న రాజయ్య కారు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో రాజయ్య ఉన్నారు. కారును బాపూజీ నగర్‌ లో వదిలేసి మడికొండ పోలీసులకు స్వయంగా రాజయ్యే సమాచారం అందించారు. ఆ తరువాత ఆయన అక్కడ నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also read: ఏపీ లో 62 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

HYD NEWS: పాపం ప్రణీత్.. గంట పాటు చిత్ర హింసలు పెట్టి చంపిన ఫ్రెండ్స్.. అసలేమైందంటే..!

హైదరాబాద్‌లో అల్వాల్‌ పరిధిలోని యాప్రాల్‌లో ప్రణీత్‌ అనే యువకుడిని స్నేహితులు హత్య చేశారు. వాటర్‌ ట్యాంక్‌ సమీపంలోని ఓ గ్రౌండ్‌లోకి ప్రణీత్‌ను తీసుకెళ్లిన స్నేహితులు దాడి చేశారు. తలను గోల్‌ పోస్ట్‌ రాడ్‌కు బాది పైశాచిక ఆనందం పొందారు.

New Update

TG Crime: ఈ మధ్య కాలంలో మనుషులు మృగాల్లా తయారవుతున్నారు. సాటి వ్యక్తి అని చూడకుండా.. చిత్రహింసలు పెట్టి ప్రాణాలు తీసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇలాంటి ఘటన తెలంగాణలో కలకలం రేపింది. హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడిని స్నేహితులు అతి దారుణంగా హింసించి చంపారు. అల్వాల్‌ పరిధిలోని యాప్రాల్‌లో ప్రణీత్‌ అనే యువకుడిని స్నేహితులు హత్య చేశారు. వాటర్‌ ట్యాంక్‌ సమీపంలోని ఓ గ్రౌండ్‌లోకి ప్రణీత్‌ను తీసుకెళ్లిన స్నేహితులు దాడి చేశారు. తలను గోల్‌ పోస్ట్‌ రాడ్‌కు బాది పైశాచిక ఆనందం పొందారు. అంతేకాకుండా గంటపాటు తీవ్ర చిత్రహింసలకు గురిచేశారు. 

అతి దారుణంగా కొట్టి..

దాడి చేసిన తర్వాత ప్రణీత్‌ను బైక్‌పై కూర్చొబెట్టుకని చక్కర్లు కొట్టి క్రూరంగా వ్యవహరించారు. ప్రణీత్‌ సోదరుడికి ఫోన్‌ చేసి మీ అన్నకు యాక్సిడెంట్‌ అయిందంటూ తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుదోవ పట్టించాలని చూశారు. తమ్ముడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. ప్రణీత్‌ మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చేతికందిన కొడుకు హత్యకు గురికావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.  

ఇది కూడా చదవండి:  హైదరాబాద్‌లో మరో లిఫ్ట్ యాక్సిడెంట్.. స్పాట్లో ముగ్గురు.. నాలుగో ఫ్లోర్ నుంచి కుప్ప కూలడంతో.. !
( ts-crime | ts-crime-news latest-news)

 

Advertisment
Advertisment
Advertisment