Watch Video: ఫుట్‌బాల్‌ ఆడుతున్న ఆటగాడిపై పిడుగుపాటు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

ఇండోనేషియాలోని ఫిబ్రవరి 10న ఓ ఫుట్‌బాల్‌ మైదానంలో మ్యాచ్ ఆడుతుండగా సెప్టైన్ రహర్జా(35) అనే ఆటగాడిపై అకస్మాత్తుగా పిడుగుపడింది. దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

New Update
Watch Video: ఫుట్‌బాల్‌ ఆడుతున్న ఆటగాడిపై పిడుగుపాటు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

సాధారణంగా వ్యవసాయ క్షేత్రంలో ఉన్నప్పుడు గానీ.. బయటకు వెళ్లినప్పుడు గాని కొంతమంది పిడుగుపాటుకు గురై చనిపోయిన ఘటనలు చాలానే ఉన్నాయి. అయితే ఓ మైదనంలో ఫుట్‌బాల్ ఆడుతుండగా.. ఒక ఆటగాడిపై అకస్మాత్తుగా పిడుగు పడటంతో అతను అక్కడికక్కడే మృతి చెందడం కలకలం రేపింది. ఈ విషాద ఘటన ఇండోనేషియాలో జరిగింది. ఈ వీడియో చూస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ప్రస్తుతం ఈ విడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: దుబాయిలో కుంభ వృష్టి.. బుర్జ్ ఖలీఫాపై పిడుగు!

అకస్మాత్తుగా పిడుగు

ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇండోనేషియా పశ్చిమ జవాలోని సిలివాంగి అనే ఫుట్‌బాల్‌ స్టేడియంలో ఓ టోర్నమెంట్‌ జరుగుతోంది. ఫిబ్రవరి 10న సాయంత్రం పూట రెండు జట్ల మధ్య ఆట జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో సుబాంగ్‌కు చెందిన సెప్టైన్ రహర్జా(35) అనే ఆటగాడు పాల్గొన్నాడు. మ్యాచ్‌లో భాగంగా మైదనంలో బంతి కోసం పరిగెడుతుండగా.. ఒక్కసారిగా అతనిపై పిడుగు పడింది. దీంతో అతడు అక్కడిక్కడే కుప్ప కూలిపోయాడు. రహర్జాను చూసిన తోటి క్రీడాకారులు ఆశ్యర్యపోయారు. వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ ఊహించని ఘటనతో తోటి క్రీడాకారులతో పాటు మైదాన ప్రాంగణమంతా.. ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. అయితే ఇండోనేషియాలో ఇలా పిడుగు పడటం ఇది రెండోసారి కావడం గమనార్హం. గత ఏడాది తూర్పు జావాలోని ఓ ప్రాంతంలో కూడా టోర్నమెంట్‌ జరుగుతుంటగా.. అక్కడ కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఈ ఘటనలో 13 ఏళ్ల బాలుడు పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. ఇలాంటి ఘటనలు తరచుగా చోటుచేసుకోవడంతో ఆటగాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే మ్యాచ్‌లు నిర్వహించే ముందు వాతావరణ పరిస్థితులు తెలుసుకొని నిర్వహించాలని అధికారులు సూచనలు చేస్తున్నారు. అయితే మృతిచెందిన రహర్జా కుటంబానికి తోటి క్రీడాకారులతో పాటు అక్కడి ఫుట్‌బాల్‌ నిర్వాకులు ఆదుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: రైతులకు ఇబ్బంది కలిగించారో !.. రాకేష్ టికైత్ హెచ్చరిక

Advertisment
Advertisment
తాజా కథనాలు