Watch Video: విమానం టేకాఫ్‌.. కాసేపటికే ఇంజిన్‌లో మంటలు.. చివరికి

కెనడాలో.. ఎయిర్ కెనడా అనే విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే కుడివైపు ఇంజిన్‌ నుంచి మంటలు వచ్చాయి. మంటలను గమనించిన గ్రౌండ్ సిబ్బంది ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ను అప్రమత్తం చేశారు. విమానాన్ని అత్యవసరంగా అక్కడే ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది.

New Update
Watch Video: విమానం టేకాఫ్‌.. కాసేపటికే ఇంజిన్‌లో మంటలు.. చివరికి

కెనడాలోని ఓ విమానశ్రయంలో షాకింగ్ ఘటన జరిగింది. ఎయిర్ కెనడా అనే విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే ఇంజిన్‌ నుంచి మంటలు వచ్చాయి. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. స్థానిక కాలమాన ప్రకారం.. బోయింగ్ 777 విమానం శుక్రవారం ఉదయం 12.17 గంటలకు టొరంటో నుంచి టేకాఫ్ అయ్యింది. ఆ ఫ్లైట్‌లో మొత్తం 389 ప్రయాణికులతో సహా 13 మంది సిబ్బంది ఉన్నారు. టెకాఫ్ అయిన కొద్దిసేపటికే ఒక్కసారిగా విమానం కుడివైపు ఇంజిన్ నుంచి మంటలు వచ్చాయి. మంటలను గ్రౌండ్‌ సిబ్బంది గమనించి ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ను అప్రమత్తం చేశారు.

Also Read: కేంద్ర కేబినెట్‌లో టీడీపీ బెర్త్‌లు ఖరారు..!

దీంతో నిమిషాల్లోనే మళ్లీ విమానాన్ని అక్కడే ల్యాండ్ చేశారు. విమానంలో కంప్రెసర్ ఆగిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఎయిర్‌ కెనడా తెలిపింది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని.. అదేరోజున ప్రయాణికులను తమ గమ్యస్థానాలు చేర్చేందుకు మరో విమానాన్ని ఏర్పాటు చేశామని పేర్కొంది. విమానం ఇంజిన్‌లో మంటలు వచ్చిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Also Read: రెండు స్థానాల్లో గెలిచిన రాహుల్‌.. వదులుకోబోయే సీటు ఇదే

;

Advertisment
Advertisment
తాజా కథనాలు