China: చైనాలో సుడిగాలి బీభత్సం.. ఐదుగురు మృతి దక్షిణ చైనాలోని గ్వాంగ్‌జౌన్‌లో సుడిగాలి బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. సుడిగాలి ప్రభావానికి 141 ఫ్యాక్టరీ భవనాలు దెబ్బతిన్నాయి. రంగంలోకి దిగిన సహాయక బృందాలు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. By B Aravind 28 Apr 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Tornado in China kills 5 People: చైనాలో సుడిగాలి బీభత్సం సృష్టించింది. దక్షిణ చైనాలోని గ్వాంగ్‌జౌన్‌లో సుడిగాలి కమ్మేసింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. సుడిగాలి ప్రభావానికి 141 ఫ్యాక్టరీ భవనాలు దెబ్బతిన్నాయి. వెంటనే సహాయక బృందాలు రంగలోకి దిగాయి. స్థానికులు ఉండే గృహాలకు ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు Also Read: మరో నల్లజాతీయుడిపై పోలీసుల కర్కశత్వం.. ఊపిరాడక బాధితుడు మృతి Tornadoes struck #Baiyun and #Zengcheng in #Guangzhou.#Tornado #GuangzhouTornado #China #ChinaTornado pic.twitter.com/WOP3hD6z40 — know the Unknown (@imurpartha) April 27, 2024 ఇదిలాఉండగా గత కొన్నిరోజులుగా దక్షిణ చైనాలో కుండపోత వానలు వరదలకు దారి తీశాయి. ఈ ప్రభావంతో దాదాపు 10 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని క్వింగ్యువాన్‌లో భారీ వర్షాలు(Heavy Rains) కురవడంతో రోడ్లు, పంట పొలాలన్నీ నీటమునిగాయి. నలుగురు మృతి చెందారు. మరికొందరు గల్లంతయ్యారు. గ్వాంగ్‌డాంగ్‌లో ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. 🎥WATCH: Guangzhou, a major city in southern China with a population exceeding 10 million, was struck by a destructive tornado, resulting in five fatalities and 33 reported injuries.#Tornado #China #ChinaTornado #Guangzhou #TORNADOEMERGENCY pic.twitter.com/XPCZr9kUNA — Forsige Breaking News (@ForsigeNews) April 27, 2024 Also Read: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్న : జో బైడెన్ #telugu-news #floods #china #tornodo #tornodo-in-china మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి