అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగు వ్యక్తిగా గోపిచంద్ తోటకూర చరిత్ర సృష్టించనున్నారు. బ్లూ ఆరిజన్ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సంస్థ చేపట్టిన 'న్యూ షెవర్డ్' ప్రాజెక్టులో టూరిస్టుగా వెళ్లనున్నారు గోపిచంద్. 1984లో రాకేశ్ శర్మ అంతరిక్షయానం చేసిన సంగతి తెలిసిందే. అలాగే కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్, రాజా చారి, శిరీష బండ్ల వీళ్లందరూ కూడా అమెరికా పౌరులే. దీంతో భారత్ నుంచి తొలి అంతరిక్ష పర్యాటకుడిగా గోపిచంద్ రికార్డు సృష్టించనున్నారు. ప్రస్తుతం ఈయన అమెరికాలో ఉంటున్నప్పటికీ భారత పాస్‌పోర్టు కలిగి ఉండటం విశేషం.
Also Read: పోలీసులకు అర్చకుల వేషాధారణ.. వివాదంలో బీజేపీ సర్కార్
అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్‌కు చెందిన అంతరిక్ష సంస్థే ఈ బ్లూ ఆరిజిన్. ఈ కంపెనీ ఇప్పటికే న్యూ షెపర్డ్ మిషన్ పేరుతో అంతరిక్ష యాత్రలకు శ్రీకారం చుట్టింది. 2021లో బెజోస్‌తో సహా ముగ్గురు పర్యాటకులు అంతరిక్ష యాత్ర చేసిన సంగతి తెలిసిందే. అయితే తర్వాత చేపట్టబోయే ఎన్‌ఎస్-25 మిషన్ కోసం గోపీచంద్‌తో సహా మొత్తం ఆరుగురిని ఎంపిక చేశారు. వెంచర్ క్యాపిలిస్ట్ మాసన్ ఏంజెల్, ఫ్రాన్స్‌కి చెందిన పారిశ్రామికవేత్త సిల్వైన్ చిరోన్ తదితరులు ఈ మిషన్‌లో ప్రయాణించనున్నారు.
ఇక గోపిచంద్ తోటూకూర స్వస్థలం విజయవాడ. అమెరికాలోని ఫ్లోరిడాలో ‘ఎంబ్రీ-రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీ’ నుంచి ఏరోనాటికల్ సైన్స్‌లో ఈయన బీఎస్సీ పూర్తి చేశారు. ప్రస్తుతం ప్రిజర్వ్ లైఫ్ సంస్థ సహా వ్యవస్థాపకుడిగా ఉన్నారు. అట్లాంటా శివారులో మిలియన్ల డాలర్లతో ఏర్పాటు చేసిన ఈ సంస్థ ఒక వెల్‌నెస్ సెంటర్. గతంలో పైలట్‌గా కూడా శిక్షణ పొందిన గోపిచంద్.. పదేళ్ల క్రితం ఇండియాలో మెడికల్ ఎయిర్- ఎవాక్యుయేషన్ సేవల్లో పనిచేశారు. మరో విషయం ఏంటంటే.. బ్లూ ఆరిజిన్ అధికారికంగా ప్రకటించే వరకు తన కుటుంబానికి కూడా ఈ విషయం తెలియదని గోపిచంద్ ఓ వార్త సంస్థతో వెల్లడించారు. తనకు 8 ఏళ్ల వయసులోనే అంతరిక్షంపై ఆసక్తి కలిగిందని చెప్పారు.
#NewShepard #NS25 crew will include Mason Angel, Sylvain Chiron, Ed Dwight, Ken Hess, Carol Schaller, and Gopi Thotakura. Read more 🚀: https://t.co/KbAJkbRTvj pic.twitter.com/8QBFYPJkYj
— Blue Origin (@blueorigin) April 4, 2024
Also Read: భారతీయులా మజాకానా.. దెబ్బకి దిగి వచ్చిన మాల్దీవులు!