USA: ట్రంప్‌ను ఇంటర్వ్యూ చేయనున్న ఎఫ్‌బీఐ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ట్రంప్ పై కాల్పులు జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే. ఈ ఘటన మీద ఎఫ్‌బీఐ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా ట్రంప్‌ను కూడా ఇంటర్వ్యూ చేయాలని ఎఫ్బీఐ భావిస్తోంది. By Manogna alamuru 31 Jul 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Donald Trump: పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తున్న సమయంలో ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఆ ఘటనలో ప్రస్తుతం ఎఫ్‌బీఐ దర్యాప్తు చేపడుతోంది. అయితే ఆ దర్యాప్తులో భాగంగా ట్రంప్‌ను కూడా ఎఫ్‌బీఐ ఇంటర్వ్యూ చేయనున్నది. ఆ ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు ట్రంప్ అంగీకరించారు. కానీ ఆ ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుందన్న తేదీని ఇంకా ప్రకటించలేదు. కానీ సాధారణ రీతిలోనే బాధిత వ్యక్తి ఇంటర్వ్యూ ఉంటుందని ఎఫ్‌బీఐ తెలిపింది. సంఘటన జరిగిన రోజున ఆయన కోణంలో ఎటువంటి అంశాలను గుర్తించారో తెలుసుకోనున్నట్లు ఎఫ్‌బీఐ స్పెషల్ ఏజెంట్ కెవిన్ రోజెక్ తెలిపారు. జూలై 13న జరిగిన దాడిలో ఎందుకు థామస్ మాథ్యూ క్రూక్స్ కాల్పులు జరిపాడన్న అంశాన్ని ఇంకా ఎఫ్‌బీఐ తేల్చలేకపోయింది. Also Read:Uttara Pradesh: క్లాస్‌లో పోర్న్ చూసిన విద్యార్థులు..అడ్డుకున్న ప్రిన్సిపల్ ను చితకబాదిన వైనం.. #usa #donald-trump #fbi #interview మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి