ఎక్స్(ట్విట్టర్) ఇక మీదట పెయిడ్ సర్వీస్-ఎలాన్ మస్క్

ఎక్స్ (ట్విట్టర్) ను వినియోగించాలంటే ఇక మీదట డబ్బులు చెల్లించాల్సిందే అంటున్నారు సీఈవో ఎలాన్ మస్క్. త్వరలోనే దానిని పెయిడ్ సర్వీస్ గా చేస్తామని ఆయనే స్వయంగా చెప్పారు.

New Update
Elon Musk : 12వ సారి తండ్రి అయిన ఎలాన్ మస్క్-ష్..గప్‌చుప్

ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను టేకోవర్ చేసిన దగ్గర నుంచీ దానిని మారుస్తూనే ఉన్నారు. ట్విట్టర్ పేరును ఎక్స్ గా మార్చడం, లోగోను సౌతం మార్చడం లాంటి పెద్ద మార్పులే చేశారు. ఇప్పుడు తాజాగా మరో కొత్త మార్పుకు శ్రీకారం చుడుతున్నారు ఎలాన్ మస్క్. ఎక్స్ ద్వారా ఆదాయం సంపాదించుకోవడానికి కొత్త ప్లాన్ వేశారు. దీని ప్రకారం ఇక మీదట ఎక్స్ వాడాలంటే ప్రతీ యూజర్ కొంత డబ్బులు చెల్లించాల్సిందేనని చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో చర్చల సందర్భంలో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు.

అయితే డబ్బులుచెల్లించమనడం వెనుక ఓ కారణముందంటున్నారు మస్క్. ఎక్స్ లో వస్తున్న బాట్స్ ను తొలిగించేందుకు ఇదే సరైన పద్ధతని చెబుతున్నారు. ప్రస్తుతం ఎక్స్ లో నెలకు 550 మిలియన్ యూజర్లు ఉంటున్నారని...రోజుకు కనీస్ 100 నుంచి 200 మిలియన్ పోస్ట్ లు ఉంటున్నాయని తెలిపారు. అందులో బాట్స్ కూడా ఉంటాఉన్నాయని అన్నారు. ఇవి పోవాలంటే చాలా కొద్దిగా అయినా ఫీజు చెల్లించాల్సిందేనని వివరించారు. బాట్స్ కు అడ్డకట్ట వేయాలంటే ఇదొక్కటే మార్గమని మస్క్ సమర్ధించుకున్నారు.

అయితే డబ్బులు చెల్లింపు విషయం మీద ఇంకా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఇంకా రాలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన ఉండొచ్చని తెలుస్తోంది. ఎక్స్ వినియోగానికి నెలకు ఎంత చెల్లించాలనే దాని మీద కూడా మస్క్ ఏమీ చెప్పలేదు. కానీ ప్రస్తుతానికి ఎక్స్ ప్రీమియం తీసుకోవాలంటే ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లునెలకు 900రూ. చెల్లించాలి. అదే వెబ్ యూజర్లు అయితే 650 చెల్లించాలి. ఇక మీదట ఎలాన్ మస్క్ ప్రకటనను బట్టి మామూలు యూజర్లు కూడా కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు