Bangladesh: పాకిస్తాన్‌కు పట్టిన గతే బంగ్లాదేశ్‌కు పడుతుంది..షేక్ హసీనా కొడుకు సంచలన వ్యాఖ్యలు

దేశంలో శాంతి భద్రతలు వెంటనే నెలకొల్పకపోతే తమ పరిస్థితి కూడా పాకిస్తాన్‌లానే తయారవుతుందని అన్నారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సజీబ్. నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ దేశాన్ని ఎలా నడిపిస్తారో వేచి చూడాలని ఆయన కామెంట్ చేశారు.

New Update
Bangladesh: పాకిస్తాన్‌కు పట్టిన గతే బంగ్లాదేశ్‌కు పడుతుంది..షేక్ హసీనా కొడుకు సంచలన వ్యాఖ్యలు

Ex Minister Sheikh Hasina Son: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆరోగ్యంగా ఉన్నారని..నా సోదరి ఆమెతో ఉందని చెప్పారు ఆమె కుమారుడు సజీబ్. కానీ మాజీ ప్రధాని చాలా బాధపడుతున్నారని సజీబ్ వాజెద్ జాయ్ డ్యూష్ విల్లేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.దేశం కోసం బంగాబంధువులు తమ జీవితాన్ని త్యాగం చేయడం తనను కలచివేసిందన్నారు. గత ఒకటిన్నర దశాబ్దంలో దేశం ఎంతో అభివృద్ధి సాధించింది. అయినప్పటికీ, ఆమెను బయటకు విసిరేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా శాంతిభద్రతలను పునరుద్ధరించకుంటే పాకిస్థాన్‌కు పట్టిన గతే బంగ్లాదేశ్‌కు కూడా వస్తుందని షేక్ హసీనా కుమారుడు అన్నారు. నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ దేశాన్ని ఎలా నడిపిస్తారో వేచి చూడాలని ఆయన అన్నారు. హసీనాతో పాటు ఆమె సోదరి షేక్ రెహానా కూడా ఉన్నారు.

భారత్‌ను వీడిన షేక్‌ హసీనా టీమ్‌.. తెలియని ప్రదేశానికి పయనం..!

ఇయ్యాల్టి న్యూస్, వెబ్ డెస్క్, ఆగస్టు 8: పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత ఏర్పడిన విషయం తెలిసిందే. షేక్‌ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఉద్యమం హింసాత్మకంగా మారింది. ప్రజాగ్రహానికి జడిసి ప్రధాని పదవికి షేక్‌ హసీనా రాజీనామా చేసి తన సోదరి, ఇతర సన్నిహితులతో కలిసి భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హసీనా సోదరులు సహా ఆమె టీమ్‌ మొత్తం ఘ‌జియాబాద్‌లోని హిండ‌న్ ఎయిర్‌బేస్‌లో తాత్కాలిక ఆశ్రయం పొందుతున్నారు. అయితే, తాజాగా హస టీమ్‌ భారత్‌ను వీడినట్లు తెలిసింది. ఆమె టీమ్‌ మొత్తం కొత్త గమ్యస్థానాలను వెతుక్కుంటూ వెళ్లిందని ప్రభుత్వ వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వారంతా తెలియని ప్రదేశానికి వెళ్లినట్లు తెలుస్తోంది.

Also Read: Paris Olympics: భారత్‌కు మరో పతకం..రజతాన్ని కొట్టిన బల్లెం వీరుడు

Advertisment
Advertisment
తాజా కథనాలు