High prices:ఆకాశన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు ఇలా అయితే బతకడం ఎలా అంటున్నారు సామాన్య మానవులు. పట్టెడన్నం తిందామంటే అవకాశం లేకుండా పోయింది. రోజురోజుకీ నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కేజీ బియ్యం ధర 80 రూ. అయ్యింది. By Manogna alamuru 04 Jan 2024 in Uncategorized New Update షేర్ చేయండి High prices:కూరల ధరలు పెరిగిపోయాయి...గుడ్డు కాస్టలీ అయిపోయింది...చికెన్ ధర పైపైకి ఎగిరిపోతోంది..చివరకు పోనీ గంజెన్నం తిందామన్నా కుదరడం లేదు. బియ్యం ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. నవబర్ లో సోనామసూరి బియ్యం కేజీ 65 రూ. ఉంటే...డిసెంబర్‌కు అది 75రూ అయింది. ఇప్పుడు కొత్త సంవత్సరంలో అది ఇంకాస్త పెరిగి 80 రూ అయి కూర్చుంది. మరోవైపు రూ.80 పెడితే కానీ డజను గుడ్లు దొరకడం లేదు. సరే గుడ్డు లేదు కోడినే తిందామా అంటే...చికెన్ ధరలూ భారీగా పెరిగాయి. రెండు రోజుల క్రితం లైవ్ కోడి ధర రూ.140 ఉండగా మంగళవారం రూ.160కు పెరిగింది. స్కిన్‌లెస్ రూ.240కు చేరింది. మటన్ అయితే ఏకంగా కేజీ వెయ్యికి పైనే ఉంది. Also Read:చౌకగా మారనున్న విమాన ప్రయాణం..తగ్గిన ఇంధనం ధరలు ఆంధ్రాలో తుఫాను ప్రబావం వరి పంట మీద బాగా పడింది. దీంతో బియ్యం ధరలు బాగా పెరిగిపోయాయి. దీంతో పాటూ ప్యాకింగ్, రవాణా ఛార్జీలతో క్వింటా రూ.6500 నుంచి రూ.7 వేల వరకూ అవుతోందంటున్నారు వ్యాపారులు. అందుకే రిటైల్‌లో కిలో రూ.75 నుంచి రూ.80 వరకూ ఉంటుందన్నారు. ఇక కూరగాయలు కూడా బాగా ప్రియం అయిపోయాయి. ఏ కూరగాయా కిలో 50 రూ. తక్కువ లేదు. ఉల్లిపాయలు, పర్చిమిర్చి లాంటివి కూడా కొండెక్కి కూర్చున్నాయి. దీంతో పేద, సామాన్య ప్రజలు ఏడుస్తున్నారు. తాము ఏం తిని బతకాలని అడుగుతున్నారు. ప్రభుత్వం తొందరగా చర్యలు తీసుకుని ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. #vegetables #rice #eggs #chicken #essential-commodities #high-prices మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి