BJP Yatra : మోదీ.. ప్రయాణం అసమానం.. ఈ పాదయాత్ర జీవితకాల అనుభవం : బీజేపీ మోదీ తమిళనాడు పర్యటన సందర్భంగా సందర్భంగా తమిళనాడు బీజేపీ నేత కె.అన్నామలై సోషల్‌మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఎన్.మక్కల్ పాదయాత్ర విజయవంతంగా ముగిసిందన్న అన్నామలై మోదీపై ప్రశంసలు కురిపించారు. తన జీవితంలో అత్యుత్తమ అనుభవం ఈ పాదయాత్ర అని చెప్పారు. By Trinath 28 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి BJP Padayatra : తమిళనాడు(Tamilnadu) బీజేపీ(BJP) అధ్యక్షుడి పాదయాత్ర(Padayatra) విజయవంతంగా ముగిసింది. పాదయాత్ర ముగింపు సభను ప్రారంభించేందుకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి భారీ ఎత్తున ప్రజలు స్వాగతం పలికారు. తిరుపూర్ చేరుకున్న ఆయన.. రోడ్ షోగా సమావేశ నగరానికి చేరుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలైతో పాటు మురుగన్ కూడా రోడ్ షో(Road Show) లో పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేపట్టిన పాదయాత్ర తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా సాగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రామేశ్వరత్ పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్ర ముగింపు సభకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social Media) లో వైరల్‌గా మారింది. Compilation of our journey in the last six months covering 234 assembly constituencies in TN during our En Mann En Makkal PadaYatra. The display of love & affection for our Hon PM Thiru @narendramodi avl throughout the journey was unparalleled. Inaugurated in Rameswaram by… pic.twitter.com/9khJnL1DKt — K.Annamalai (@annamalai_k) February 27, 2024 తిరుప్పూర్‌లో జరిగిన సభలో మోదీ(Modi) ప్రసంగించారు. ఈ సందర్భంగా తమిళనాడు బీజేపీ నేత అన్నమలై(Annamalai) వీడియోను పోస్ట్ చేశారు. మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ 6 నెలల కాలంలో మోదీ సహకారం అపురూపమన్నారు. ఈ యాత్రను మన గౌరవనీయులైన హోంమంత్రి అమిత్ షా రామేశ్వరంలో ప్రారంభించారని చెప్పుకొచ్చారు. పాదయాత్రలో గత ఆరు నెలల్లో మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేశామన్నారు అన్నామలై. తమ ప్రయాణం అసమానమైనదని.. ఈ పాదయాత్ర తనకు జీవితకాల అనుభమన్నారు. Also Read : Lok Sabha Elections: ఈనెల 29న బీజేపీ తొలి జాబితా? Also Read : Telangana: తీవ్ర ఉద్రిక్తతగా బండి సంజయ్ ప్రజాహిత యాత్ర #bjp #narendra-modi #padayatra #tamilnadu #annamalai మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి