Elon Musk: ఆ సమస్యను పరిష్కరించండి.. సత్యనాదెళ్లకు ఎలాన్‌ మస్క్‌ మెసేజ్

టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ఇటీవల విండోస్ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేశారు. అయితే మైక్రోసాఫ్ట్‌ అకౌంట్‌తో లాగిన్ కావాల్సి ఉండటంతో తన సమస్యను మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదేళ్లకు మెసేజ్‌ పెట్టారు. మైక్రోసాఫ్ట్‌ అకౌంట్ లేకుండానే కంప్యూటర్ వినియోగించుకునే ఆప్షన్‌కు తీసుకురావాలని కోరారు.

New Update
Elon Musk: ఆ సమస్యను పరిష్కరించండి.. సత్యనాదెళ్లకు ఎలాన్‌ మస్క్‌ మెసేజ్

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త కొత్త ఆవిష్కరణలను అభివృద్ధి చేస్తూ.. నిత్యం సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వార్తల్లో కనిపిస్తూనే ఉంటారు. ఇటీవలే తమ న్యూరాలింక్ సంస్థ.. విజయవంతంగా ఓ మనిషి మెదడులో చిప్‌ను ప్రవేశపెట్టిందని.. అది స్పందిస్తుందని ప్రకటన చేసి మరోసారి సంచలనం సృష్టించారు. అయితే తాజాగా ఆయనకు ఓ సమస్య ఎదురైంది. ఇటీవలే ఆయన విండోస్‌ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేశారు. అందులో మైక్రోసాఫ్ట్‌ అకౌంట్‌తో లాగిన్ కావాల్సి వచ్చింది. కానీ మస్క్‌ విండోస్‌ అకౌంట్‌ క్రియేట్ చేసేందుకు ఇష్టపడలేదు. దీంతో తన సమస్యను ఎక్స్‌లో చెప్పారు. సరైన స్పందన రాకపోవడంతో.. చివరికి మైక్రోసాఫ్ట్‌ అధినేత సత్య నాదేళ్లకే మెసెజ్‌ పెట్టారు.

Also Read: సైనిక కార్యకలాపాల్లోకి వచ్చేసిన అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్

మైక్రోసాఫ్ట్‌ అకౌంట్ క్రియేట్‌ చేయకుండానే విండోస్‌ వినియోగించేలా అనుమతించాలని కోరారు. కంప్యూటర్‌ వైఫైకి కనెక్ట్‌ అయితే.. ఆ ఆప్షన్ కనిపించకుండా పోతుందని.. అలాగే కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకున్నా కూడా వర్క్‌ ఈమెయిల్‌ అడ్రస్ వాడుకోలేమని అన్నారు. నాకు వర్క్‌ ఈమెయిల్స్‌ మాత్రమే ఉన్నాయని చెప్పారు. అయితే దీనిపై సత్య నాదేళ్ల నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదు.

అయితే ఇంతకుముందు కూడా ఇదే అంశంపై ఎలాన్ మస్క్‌ ట్వీట్‌ చేశారు. ఎంఎస్‌ అకౌంట్‌ లేకుండా కొత్త ల్యాప్‌టాప్‌ను యాక్సె్స్‌ చేయలేకపోతున్నానని అన్నారు. మైక్రోసాఫ్ట్‌ అర్టిఫిషయ్‌ ఇంటిలిజెన్స్‌కు తన కంప్యూటర్ యాక్సె్స్‌ ఇవ్వాలనుకోవడం లేదని.. ఇదంతా చూడటానికి గందరగోళంగా ఉందని తెలిపారు. మైక్రోసాఫ్ట్‌ అకౌంట్ లేకుండానే కంప్యూటర్ వినియోగించుకునే ఆప్షన్‌కు తీసుకురావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Also Read: ఆయన భార్య పేరు మరిచిపోయారు.. ట్రంప్‌పై జో బైడెన్‌ విమర్శలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

మోదీకి సౌదీ పర్యటనలో ఫైటర్ జెట్ల ఎస్కార్ట్.. 6 విమానాలతో స్వాగతం (VIDEO)

సౌదీ అరేబియా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీకి రాయల్‌ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌‌ గగనతలంలో ఎస్కార్ట్ ఏర్పాటు చేసింది. మోదీ విమానం ఆ దేశంలోకి వెళ్లగానే 6ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌గా వచ్చాయి. 2వ స్ట్రాట‌జిక్ పార్ట్నర్‌షిప్ కౌన్సిల్ స‌మావేశానికి ఆయన అక్కడికి వెళ్లారు.

New Update
Saudi Arabia visit

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. 2 రోజుల పాటు ఆయన సౌదీలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సౌదీ బయల్దేరి వెళ్లారు. ప్రధానికి సౌదీ ప్రభుత్వం ప్రత్యేకంగా స్వాగతం పలికింది. మోదీ ప్రయాణిస్తోన్న విమానం ఆ దేశ గగనతలంలోకి ప్రవేశించగానే రాయల్‌ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌‌కు చెందిన ఎఫ్‌-15 విమానాలు దానిని ఎస్కార్ట్‌గా వచ్చాయి. మోదీ ప్రయాణిస్తు్న్న విమానానికి ఇరువైపులా మూడేసి చొప్పున 6 జెట్ ఫైటర్లు ఎస్కార్ట్‌గా నిలిచి స్వాగతం పలికాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

Also read: New Pope: కొత్త పోప్ ఎన్నికలో కీలకంగా నలుగురు ఇండియన్ కార్డినల్స్

సౌదీకి బ‌య‌లుదేరి వెళ్లడానికి ముందు ప్రధాని ఓ ట్వీట్ చేశారు. ఇటీవ‌ల 2 దేశాల మ‌ధ్య బంధం మ‌రింత దృఢ‌మైంద‌న్నారు. ర‌క్షణ‌, వాణిజ్య, పెట్టుబ‌డి, ఎనర్జీ రంగాల్లో స‌హ‌కారం పెరిగింద‌న్నారు. ప్రాంతీయంగా శాంతి, సామ‌ర‌స్యం, స్థిర‌త్వం పెంచేందుకు ఇండియా, సౌదీ దేశాలు క‌ట్టుబ‌డి ఉన్నట్లు తెలిపారు.

Also read: BIG BREAKING: గుజరాత్‌లో కూప్పకూలిపోయిన విమానం.. భారీ పేలుడు

ప్రధాని హోదాలో మోదీ సౌదీ వెళ్లడం ఇది మూడోసారి అయినా.. జెడ్డాకు వెళ్లడం ఇదే మొద‌టిసారి. రెండ‌వ స్ట్రాట‌జిక్ పార్ట్నర్‌షిప్ కౌన్సిల్ స‌మావేశంలో ఆయ‌న పాల్గొనున్నారు. ప్రధాని తన పర్యటనలో జెడ్డాలో ఆ దేశంతో 6 ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. సౌదీ ఆరేబియా చ‌క్రవ‌ర్తి మ‌హ‌మ్మద్ బిన్ స‌ల్మాన్ అల్ సౌద్‌తో జ‌రిగే చ‌ర్చల్లో భార‌తీయ యాత్రికుల‌కు చెందిన హ‌జ్ కోటా గురించి మాట్లాడ‌నున్నారు.

(saudi-arabia | modi-visit | Air escort)

Advertisment
Advertisment
Advertisment