Arvind Kejriwal: ఢిల్లీ సీఎంకు మరోసారి ఈడీ నోటీసులు లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కు మరోసారి సమన్లు పంపింది ఈడీ. ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే.. ఈసారైనా కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరవుతారా? లేదా? అనేది వేచి చూడాలి. By V.J Reddy 14 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ED Issues Sixth Summons To Kejriwal: ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, ఈడీ మధ్య పంచాయితీ ఇంకా తెగలేదు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు (Delhi Liquor Scam Case) ఎదురుకుంటున్న విచారించేందుకు ఈడీ కేజ్రీవాల్ కు నోటీసులు పంపుతున్న.. కేజ్రీవాల్ (Arvind Kejriwal) మాత్రం ఈడీ ఇచ్చిన నోటీసులను పక్కకి పెట్టి తన రాజకీయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. తాజాగా ఆరో సారి కూడా లిక్కర్ స్కాం కేసులో విచారణకు హాజరు కావాలని ఈడీ కేజ్రీవాల్ కు నోటీసులు పంపింది. ఈ నెల 19న ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే... ఐదు సార్లు ఈడీ నోటీసులు (ED Notices) పంపిన పట్టించుకోని కేజ్రీవాల్.. విచారణకు హాజరు అవుతారా? లేదా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ALSO READ: తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన కోర్టుకు ఈడీ… ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యవహారంపై కోర్టుకు వెళ్ళింది ఈడీ. లిక్కర్ స్కాం కేసులో విచారణకు రావాలని ఐదు సార్లు సీఎం కేజ్రీవాల్ కు నోటీసులు పంపింది ఈడీ. అయితే.. కేజ్రీవాల్ మాత్రం ఈడీ నోటీసులను పక్కకు పెట్టి విచారణకు రాలేదు. మొత్తం ఐదు సార్లు కూడా విచారణకు కేజ్రీవాల్ డుమ్మా కొట్టడంతో రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించింది ఈడీ. గతంలో బీజేపీపై ఆరోపణలు.. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) ని కూల్చేందుకు బీజేపీ(BJP) ప్రయత్నిస్తోందని అన్నారు. ఢిల్లీలో ఆపరేషన్ లోటస్‌కు బీజేపీ తెరతీస్తోందని కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే తనకు అరెస్ట్ చేయిస్తామని తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ బెదిరిస్తోందని ఆరోపణలు చేశారు. అప్పుడు ఆప్ ప్రభుత్వం కూలిపోతుందని… దాని తర్వాత బీజేపీ పార్టీ నుంచి ఆప్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తామని ప్రలోభ పెడుతున్నారని పేర్కొన్నారు. తమ ఎమ్మెల్యేలు ఏడుగురిని బీజేపీ కొనడానికి చూసిందని కేజ్రీవాల్ అన్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకు 25 కోట్లు ఇస్తామని ప్రలోభపెట్టిందని తెలిపారు. ALSO READ: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి 20 మంది! DO WATCH: #ed #delhi-liquor-scam-case #kejriwal #cm-arvind-kejriwal #aap-in-delhi-liquor-scam #enforcement-directorate #aravind-kejriwal-arrest మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి