Lok Sabha Elections: లోక్‌సభ ఐదు దశల్లో ఎంత మంది ఓటు వేశారంటే.. కేంద్ర ఎన్నికల సంఘం ఐదు దశల్లో పోలైన ఓట్ల సంఖ్యను శనివారం తమ వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. ఇందులో మొత్తం 76.41 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 50.72 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపింది. By B Aravind 26 May 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి EC Releases Number of Votes Cast in 5 Phases: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఆరు దశల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) ఐదు దశల్లో పోలైన ఓట్ల సంఖ్యను శనివారం తమ వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. ఇందులో మొత్తం 76.41 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 50.72 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపింది. అలాగే పోలైన ఓట్ల సంఖ్యను కూడా మార్చడం అసాధ్యమని ఈసీ క్లారిటీ ఇచ్చింది. Also Read: ఎమ్మెల్సీ ఎన్నికలో ఎడమ చేయి మధ్య వేలుకు సిరా గుర్తు.. ఎందుకంటే ప్రతి నియోజకవర్గాల్లో బూత్‌ల వారీగా పోలైన ఓట్ల శాతాన్ని వెబ్‌సైట్ ఉంచేలా ఈసీ ఆదేశించాలని సుప్రీంకోర్టులో ఇటీవల పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారించిన న్యాయస్థానం ఎన్నికలు పూర్తి కానందున ఆ అభ్యర్థనను తిరస్కరించింది. అయినప్పటికీ మరుసటి రోజే ఎన్నికల సంఘం ఓట్ల గణాంకాలను వెల్లడించింది. ఈ విధానాన్ని మరింతగా విస్తరిస్తామని కూడా చెప్పింది. అలాగే పోలింగ్ సమాచారం ఎల్లప్పుడూ యాప్‌లో అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఇదిలాఉండగా.. ప్రపంచంలోనే అత్యంధికంగా ఓటర్లు ఉన్న దేశం మన ఇండియానే కావడం విశేషం. మొత్తం 96.88 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. మరోవైపు జూన్ 1న లోక్‌సభ ఎన్నికలు పూర్తవుతాయి. అయితే ఈసారి కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారనేది దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. Also Read: ఆస్పత్రిలో ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురు శిశువులు మృతి #telugu-news #national-news #lok-sabha-elections-2024 #election-commission మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి