Election Commission: ప్రధాని మోదీ, రాహల్‌కు ఈసీ షాక్..

బీజేపీతో సహా.. కాంగ్రెస్‌ పార్టీకి ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం, విద్వేషపూరిత ప్రసంగం చేయడంపై అసహనం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 29న ఉదయం 11 గంటల లోగా తమ ప్రసంగాలపై వివరణ ఇవ్వాలని రెండు పార్టీలకూ ఆదేశించింది.

New Update
Election Commission: ఈసీ సంచలన నిర్ణయం.. పోలింగ్ సమయం పెంపు

EC Notices To PM Modi : బీజేపీతో సహా.. కాంగ్రెస్‌(Congress) పార్టీకి ఎన్నికల సంఘం(Election Commission) నోటీసులు ఇచ్చింది. ప్రధాని మోదీ(PM Modi), రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం, విద్వేషపూరిత ప్రసంగం చేయడంపై అసహనం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 29న ఉదయం 11 గంటల లోగా తమ ప్రసంగాలపై వివరణ ఇవ్వాలని రెండు పార్టీలకూ ఆదేశించింది. అంతేకాదు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు కూడా నోటీసులు ఇచ్చింది.

Also read: తమన్నకు సమన్లు జారీ చేసిన మహారాష్ట్ర సైబర్ సెల్‌.. ఎందుకంటే

అయితే ఈ నోటీసులు ఇచ్చే సమయంలో ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ ప్రసంగాలపై అసహనం వ్యక్తం చేసింది. ఇది తీవ్ర పరిమాణాలకు దారి తీసే ప్రమాదం ఉందని పేర్కొంది. 'రాజకీయ పార్టీలన్నీ కూడా తమ అభ్యర్థులు ఎన్నికల నియమావళిని పాటిస్తున్నాయో లేదా అన్నది ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ ఉండాలి. ఇది పార్టీల ముఖ్య బాధ్యత. అలాగే స్టార్ క్యాంపెయినర్ల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇలాంటి విద్వేస ప్రసంగాలు ఇవ్వడం వల్ల తీవ్ర పరిమాణాలకు దారి తీసే ప్రమాదం ఉందని' ఎన్నికల సంఘం తెలిపింది. అయితే ఇటీవల మతం, కులం, జాతీ, భాష ఆధారంగా విద్వేష ప్రసంగాలు చేస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపణలు చేశాయి. ఈ నేపథ్యంలోనే ఈసీ చర్యలు తీసుకుంది.

Also Read : 3 సంవత్సరాల కష్టం … ‘రామాయణం’ కోసం రణ్‌బీర్ లుక్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

Advertisment
Advertisment
తాజా కథనాలు