EC : ఈ ఎన్నికల్లో రికార్డ్ స్థాయి ఓటింగ్-సీఈసీ దేశవ్యాప్తంగా రేపు అన్ని రాష్ట్రాల లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కౌటింగ్ జరగనుంది. దీని మీద ఎన్నికల కమీషన్ ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. దేశ వ్యాప్తంగా కౌంటింగ్‌కు చేసిన ఏర్పాట్లపై కమిషనర్ రాజీవ్ కుమార్ వివరించారు. By Manogna alamuru 03 Jun 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి EC Press Conference : దేశ వ్యాప్తంగా ఎన్నికల కౌటింగ్ (Election Counting) కు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు సీఈసీ (CEC) రాజీవ్ కుమార్ (Rajiv Kumar). ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని తెలిపారు. ఏడు విడతలుగా పోలింగ్ విజయవంతంగా ముగిసిందని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో 64,2 కోట్ల మంది ఓటు వేశారని... ఇదొక రికార్డ్ అని సీఈసీ తెలిపారు. 31 కోట్ల మంది మహిళలు ఓటు వేశారని చెప్పారు. దీంతో పాటూ ఓటర్లకు రాజీవ్ కుమార్ స్టాండింగ్ అవేషన్ ఇచ్చారు. మన దేశంలో ఓటేసిన వారి సంఖ్య జీ7 దేశాల జనాభాకంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉందని రాజీవ్ కుమార్ కామెంట్ చేశారు. ప్రపంచంలోనే అతి పెద్దది.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ ఇదే అని చెప్పారు సీఈసీ రాజీవ్ కుమార్. ఈ మొత్తం ప్రక్రియలో 1.5కోట్ల మంది పోలింగ్ (Polling), సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వర్తించారు. 68,763 బృందాలు ఈ ఎన్నికలను పర్యవేక్షించాయి. 135 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చాం. ఎన్నికల ఏర్పాట్ల కోసం 4లక్షల వాహనాలను ఉపయోగించామని తెలిపారు. ఇక పోలింగ్ విషయానికి వస్తే 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రీపోలింగ్ అవసరం రాలేదు. గత ఎన్నికల్లో 540 చోట్ల రీపోలింగ్ నిర్వహించగా.. ఈసారి ఆ సంఖ్య 39కు తగ్గింది చెప్పారు. ఎప్పటికంటే ఎక్కువగా జమ్మూకశ్మీర్‌లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైందని సీఈసీ వివరించారు. అక్కడ 58.58శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. కశ్మీర్ లోయలో 51.05శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికల ముగింపుపై ఈసీ ఇటువంటి సమావేశాన్ని ఏర్పాటుచేయడం ఇదే మొదటిసారి. Also Read : తిరుపతిలో పరిస్థితి తారుమారు.. గెలిచేది ఎవరో చెప్పిన రవిప్రకాష్ #elections #counting #cec #press-conference మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి