Cholesterol: కొలెస్ట్రాల్‌ మాయం చేసే జీడిపప్పు.. రోజుకు ఎన్ని తినాలో తెలుసా?

రుచికే కాదు శరీరానికి కూడా జీడిపప్పు ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. రోజూ జీడిపప్పు తింటే అనేక రోగాలు దూరమవుతాయి. జీడిపప్పు వాడటం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీర జీవక్రియలు ఆరోగ్యంగా ఉంటాయి. జీడిపప్పులో ఉండే పీచు కొలెస్ట్రాల్ స్థాయిని, రక్తపోటును తగ్గిస్తుంది.

New Update
Cholesterol: కొలెస్ట్రాల్‌ మాయం చేసే జీడిపప్పు.. రోజుకు ఎన్ని తినాలో తెలుసా?

Cholesterol: జీడిపప్పులో ఐరన్, ప్రొటీన్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్ల వంటి శక్తివంతమైన మూలకాలు ఉంటాయి. రోజూ జీడిపప్పు తింటే అనేక రోగాలు దూరమవుతాయి. డ్రై ఫ్రూట్స్ అంటే ముందుగా గుర్తొచ్చేది జీడిపప్పే. దీన్ని ఎక్కువగా స్వీట్లతో ఉపయోగిస్తుంటారు. పులావ్‌ లాంటి వంటకాల్లో జీడిపప్పు పడిందంటే ఆ టెస్టే వేరుగా ఉంటుంది. రుచికే కాదు శరీరానికి కూడా జీడిపప్పు ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది.

జీడిపప్పు ప్రయోజనాలు:

  • జీడిపప్పు వాడటం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీడిపప్పు తీసుకోవడం వల్ల శరీర జీవక్రియలు ఆరోగ్యంగా ఉంటాయి. జీడిపప్పులో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన ఆహారపు కొవ్వులకు మంచి మూలం. ఇది LDL కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు.

గుండె జబ్బులు దూరం:

  • జీడిపప్పు తింనటం వలన జింక్, పొటాషియం, సెలీనియం, మెగ్నీషియం, కాపర్, మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. జీడిపప్పులో కొలెస్ట్రాల్ స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గుండె జబ్బుల నుంచి మనల్ని రక్షిస్తాయి. ఇందులో ఉండే ఒలిక్ యాసిడ్ గుండె జబ్బుల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. జీడిపప్పు HDL కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. అంతేకాకుండా ట్రైగ్లిజరైడ్ స్థాయిని, రక్తపోటును తగ్గించడంలో బాగా పనిచేస్తుంది.

వాపును తగ్గిస్తుంది:

  • జీడిపప్పులో ఉండే పీచు కొలెస్ట్రాల్ స్థాయిని, రక్తపోటును, వాపును తగ్గిస్తుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీడిపప్పులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు హార్ట్‌బీట్‌ని మెయింటెయిన్ చేస్తాయి. ఇందులో ఉండే ఎల్-అర్జినైన్ అనే సమ్మేళనం రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది.

ఇది కూడా చదవండి: అరగంటలో బ్రెయిన్‌ ట్యూమర్‌కి చికిత్స.. ఖర్చు ఎంతంటే?

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

J&K : వారిని వదిలిపెట్టేదే లేదు..ఉగ్రదాడిపై నేతల రియాక్షన్

జమ్మూలోని పహల్గామ్ లోని ఉగ్రదాడిపై ప్రధాన మోదీ, రాష్ట్రపతితో పాటూ నేతలందరూ స్పందించారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలిపెట్టేదే లేదని ప్రధాని మోదీ అన్నారు. ఇదొక క్రూరమైన అమానవీయ చర్య అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

New Update
attack jammu

attack jammu

జమ్మూలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ యావత్ దేశాన్ని షాక్ లో పడేసింది. అమాయక టూరిస్టులు చనిపోవడంపై నేతలు అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ..కేంద్రహోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇందులో మృత చెందిన వారికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అత్యంత హేయమైన పనికి ఒడిగట్టినవారిని చట్టం ముందుకు తీసకువస్తామని...వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మోదీ చెప్పారు. టెర్రరిస్టుల ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదని...వారిపై పోరాడాలన్న సంకల్పం మరింత ధృడమైందని ప్రధాని అన్నారు. దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

పహల్గాం ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య అని రాష్ట్ర పత్రి అన్నారు.ఇదొక క్రూరమైన, అమానవీయ చర్యలను చెప్పారు. అమాయక పౌరులను చంపేయడం క్షమించరానిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పోస్ట్‌ చేశారు.

సీఎం చంద్రబాబు..

టెర్రరిస్టుల దాడి ఘన తీవ్ర ఆవేదన కలిగించిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమాయకులైన పర్యాటకులపై పాశవిక చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ తెలిపారు. 

సీఎం రేవంత్ రెడ్డి..

పహల్గామ్ అటాక్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుశ్చర్యగా అభివర్ణించారు. ఇలాంటి దొంగదెబ్బ తో  భారతీయుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఆయన చెప్పారు. ఈ దాులపై పరభత్వం వెంటనే చర్యలు తీసుకోవాని...వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని రేవంత్ కేంద్రాన్ని కోరారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆయన కోరారు. 

కిషన్ రెడ్డి..

ఉగ్రవాదుల దాడి తనను కలిచి వేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జాతి మొత్తం ఏకతాటిపై ఉంటుంది. అమాయక పౌరులపై ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య అన్నారు. జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడి ఘటన పట్ల కలతచెందినట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. 

గజేంద్ర సింగ్ షెకావత్..

ఉగ్రదాడి ఒక పిరికిపంద చర్య అన్నారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఈ కిరాతక దాడికి పాల్పడిన వారు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

today-latest-news-in-telugu | jammu | terror-attack | leaders | pm modi 

Also Read: ’పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు‘

Advertisment
Advertisment
Advertisment