Movies: పుష్ప-2 మామూలుగా ఉండదు అంటున్న డీఎస్పీ

సుకుమార్ సంచలనం పుష్ప పార్ట్ 1 పాన్ ఇండియా లెవెల్ లో సృష్టించిన విధ్వంసం గురించి తెలిసిందే. పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ నట విశ్వరూపానికి జాతీయ అవార్డే తల వంచేసింది. ఇప్పుడు వచ్చే పుష్ప-2 అంతకు మించి ఉంటుంది అంటున్నాడు ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్.

New Update
Movies: పుష్ప-2 మామూలుగా ఉండదు అంటున్న డీఎస్పీ

Pushpa 2: సుకుమార్ డైరెక్షన్ టాలెంట్.. దేవి శ్రీ అదరగొట్టే మ్యూజిక్.. అల్లు అర్జున్ మెస్మరైజ్ యాక్టింగ్ ఇవన్నీ కలిపి పుష్ప 1 ని బ్లాక్ బస్టర్ హిట్ చేశాయి. ఈ అంచాలను కంటిన్యూ చేస్తూ పుష్ప-2 మీద కూడా హైప్ ను పెంచేశాడు దర్శకుడు సుకుమార్. ఈ సినిమా గ్లింప్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. సినిమా అంతకు మించి ఉంటుంది అంటున్నాడు ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ డీఎస్పీ.

Also read:నేను ఇంకా ఎంతకాలం కొట్లాడాలి.. బోధన్ సభలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు!

పార్ట్ 2 సినిమా గురించి లేటెస్ట్ గా మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ చేసిన కామెంట్స్ సినిమాపై మరింత హైప్ తెచ్చాయి. సుకుమార్ పార్ట్ 2 కథను తనకు చంద్రబోస్ కి కలిసి చెప్పారు. ఆ కథ విన్నప్పుడే ఆ స్క్రీన్ ప్లే కూడా ప్రతి సీన్ ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ లాగా ఉంటుందని అన్నారు. పుష్ప 2 లో జాతర సీన్ సినిమాకే హైలెట్ గా ఉండబోతుందని తెలిసిందే. ఇప్పటికే ఈ సీన్ లో అల్లు అర్జున్ అమ్మవారి గెటప్ దుమ్ము లేపింది. పోస్టర్ తోనే పూనకాలు తెప్పించేసిన బన్నీ సినిమాలో ఆ ఎపిసోడ్స్ లో ప్రేక్షకులకు మెంటల్ ఎక్కించే పర్ఫార్మెన్స్ ఇస్తాడని అంటున్నారు. అలాగే ఈ టైమ్ లో వచ్చఏ పాట కూడా పిచ్చెక్కిస్తుందని చెబుతున్నాడు డీఎస్పీ.

పుష్ప 2 సినిమా 2024 ఆగష్టు 15న రిలీజ్ చేసేందుకు ఫిక్స్ చేశారు. పార్ట్ 2లో స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందని చెబుతున్నా.. అది ఎవరు చేస్తున్నారు అన్న విషయం మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు