Hyderabad Car Accident : మాజీ మంత్రి షకీల్ కొడుకు సోహెల్‌ను అరెస్ట్ చేయొద్దు-హైకోర్టు మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ ను అరెస్ట్ చెయ్యొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 17 న పోలీసుల ముందు హాజరు కావాలని చెప్పింది. తదుపరి విచారణ ఈ నెల 24 కు కోర్టు వాయిదా వేసింది .పంజాగుట్ట కార్ ప్రమాదం కేసులో సోహెల్ క్వాష్ పిటిషన్ వేసాడు. By Manogna alamuru 09 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Sohel : మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్(Sohel) ను అరెస్ట్ చెయ్యొద్దని తెలంగాణ హైకోర్టు(Telangana High Court) ఆదేశించింది. ఈ నెల 17 న సోహెల్ పోలీసుల ముందు హాజరు కావాలని చెప్పింది. తదుపరి విచారణ ఈ నెల 24 కు కోర్టు వాయిదా వేసింది. పంజాగుట్ట కార్ ప్రమాదం(Punjagutta Car Accident) కేసులో సోహెల్ క్వాష్ పిటిషన్ వేసాడు. యాక్సిడెంట్‌తో తనకేం సంబంధం లేదంటూ మాజీ మంత్రి షకీల్ కొడుకు సోహెల్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేశాడు. Also read:మాల్దీవుల అధ్యక్షునిపై అవిశ్వానికి పిలుపునిచ్చిన ప్రతిపక్షం బయటకు వచ్చిన సోహెల్.. తాగి కారు నడిపి ప్రజాభవన్(Praja Bhavan) గేట్లను కారుతో గుద్దిన మాజీ మంత్రి షకీల్ కొడుకు సోహెల్ కేసులో మరో మలుపు చోటు చేసుకుంది. యాక్సిడెంట్(Accident) తర్వాత ఇన్నాళ్ళకు బయటకు వచ్చిన సోహెల్ ఇప్పుడు తన మీద తప్పుడు కేసు పెట్టారంటూ కోర్టు మెట్లు ఎక్కాడు. యాక్సిడెంట్‌తో తనకేం సంబంధం లేదంటూ మాజీ మంత్రి షకీల్ కొడుకు సోహెల్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేశాడు. పోలీసులు కావాలనే తన పేరును నిందితుడిగా పెట్టారని సోహెల్ అంటున్నాడు. ప్రత్యక్ష సాక్షిగా ఉన్న కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆసిఫ్‌ను మొదట నిందితుడిగా చేర్చారు కానీ పోలీసుల విచారణలో అతను తప్పుడు సమాచారం ఇచ్చాడని సాహిల్ అంటున్నాడు. పోలీసులు కావాలనే తన పేరు చెప్పేలా ఆసిఫ్‌పై ఒత్తిడి చేశారని అంటున్నాడు. సాహిల్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. అసలేం జరిగిందంటే... డిసెంబర్ 24న ప్రజాభవన్ వద్ద అతివేగంగా వచ్చిన ఓ బీఎండబ్ల్యూ కారు(BMW Car) భారీకేడ్లను ఢీ కొట్టింది. ఆ సమయంలో కారులో ఇద్దరు యువకులతో పాటు ఇద్దరు యువతులు తెలిసింది. ఇప్పుడు ఆ కారు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ దని చెబుతున్నారు పోలీసులు. వీళ్లంతా స్టూడెంట్స్ అని.. కారు డ్రైవ్ చేసింది బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ అని కన్ఫామ్ చేశారు. యాక్సిడెంట్ జరిగిన తర్వాత షకీల్ ఇంట్లో డ్రైవర్‌గా పని వేసే వ్యక్తి.. తానే డ్రైవ్ చేసినట్లుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చాడని వెల్లడించారు. షకీల్ డ్రైవర్ పోలీసుల్ని తప్పుదోవ పట్టించే యత్నం చేశాడని.. కానీ సీసీ ఫుటేజీ ద్వారా సోహెల్ కారు నడిపినట్లు గుర్తించినట్లు చెప్పారు. మద్యం మత్తులో బారికేడ్లను ఢీకొట్టారని చెబుతున్నారు. సోహెల్‌పై గతంలోనూ జూబ్లీహిల్స్‌లో ఓ యాక్సిడెంట్ కేసు నమోదైందన్నారు. అయితే పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి సోహెల్ తప్పించుకున్న నేపథ్యంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ తరువాత సోహెల్ దుబాయ్ కూడా పారిపోవడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. #arrest #high-court #car-accident #telanagana #brs-ex-mla-shakeel #sohel మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి