Vijayawada: రోడ్డు మీద సీపీఆర్ చేసి ఆరేళ్ల బాలుడ్ని కాపాడిన వైద్యురాలు! అప్పటి వరకు అందరితో కబుర్లు చెబుతూ ఎంతో చలాకీగా ఆటాలాడిన పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అటుగా వెళ్తున్న ఓ వైద్యురాలు ఆ పిల్లాడి పరిస్థితి తెలుసుకుని రోడ్డు మీదే బాలుడికి సీపీఆర్ అందించడంతో ఆ పిల్లాడు మళ్లీ ఊపిరి తీసుకున్నాడు. By Bhavana 17 May 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Vijayawada Doctor CPR Incident: అప్పటి వరకు అందరితో కబుర్లు చెబుతూ ఎంతో చలాకీగా ఆటాలాడిన పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తల్లిదండ్రులు ఎంత పిలిచినా ఉలుకూ పలుకూ లేకుండా పడి ఉన్నాడు..దీంతో ఆ తల్లిదండ్రులకు ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. దీంతో అంతబాధలోనూ పిల్లాడ్ని భుజాన వేసుకుని ఆసుపత్రికి పరుగులు పెట్టారు. దీంతో అటుగా వెళ్తున్న ఓ వైద్యురాలు ఆ పిల్లాడి పరిస్థితి తెలుసుకుని బాలుడికి ఊపిరిపోసేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో రోడ్డు మీదే బాలుడికి సీపీఆర్ అందించడంతో ఆ పిల్లాడు మళ్లీ ఊపిరి తీసుకున్నాడు. విజయవాడలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలుడి ప్రాణాలు రక్షించిన డాక్టర్ రవళిపై (Doctor Ravali) అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సీపీఆర్ గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని డాక్టర్ నన్నపనేని రవళి తెలిపారు. తాను అచేతనంగా పడి ఉన్న సాయిని చూసిన వెంటనే సీపీఆర్ చేశానని.. సీపీఆర్ చేయటం వల్ల ప్రాణాలను కాపాడే అవకాశం ఎక్కువ అని ఆమె వెల్లడించారు. పిల్లాడి ప్రాణం కాపాడటం ఆనందంగా ఉందన్నారు. సుమారు 5 నిమిషాల పాటు సీపీఆర్ చేశానన్నారు. ఓ వైద్యురాలిగా తన పని తాను చేశానని ఆమె వివరించారు. Also read: ఎన్నికల వేళ టీఎస్ఆర్టీసీకి కాసుల పంట..ఎన్ని కోట్ల ఆదాయమో తెలుసా! #vijayawada #viral #doctor #cpr #boy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి