IPL2024 : హార్థిక్ ను విమర్శించడం ఆపండి కోహ్లీ!

ఐపీఎల్ 2024లో నిన్న జరిగిన ముంబై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో ముంబై ఘన విజయం సాధించింది. అయితే వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో విరాట్ చేసిన ఓ పని ముంబై అభిమానుల మనసు గెలుచుకుంది.అసలు విరాట్ స్టేడియంలో ఏం చేశాడో చూసేయండి!

New Update
IPL2024 : హార్థిక్ ను విమర్శించడం ఆపండి కోహ్లీ!

Kohli : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024(Indian Premier League 2024) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ల పేలవ ప్రదర్శనతో భారీ స్కోరును సైతం కాపాడుకోలేకపోతున్న ఆ జట్టు.. ముంబైతో జరిగిన మ్యాచులో అదే పునరావృతం చేసింది. 196 పరుగులు చేసినా RCB జట్టు ఆ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. అయితే వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఓ ఘటన చోటు చేసుకుందిముంబై జట్టు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా(Hardik Pandya) నియమితులైనప్పటి నుంచి ఆ జట్టు అభిమానులు నిరంతరం నిరసనలు తెలుపుతూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. హార్థిక్ పాండ్యాను గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో,స్టేడియంలో విమర్శలు చేస్తున్నారు. ఈ సందర్భంలో ముంబై అభిమానులు హర్థిక్ ను నిన్న జరిగిన RCB పై మ్యాచ్ లో కూడా ఇదే తీరును కొనసాగించారు.ఇది గమనించిన విరాట్(Virat Kohli) వారిపై ఇలా స్పందించారు.

ముంబై(Mumbai) జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాను అభిమానులు వ్యతిరేఖించవద్దని ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లీ అభిమానులకు వాంఖడే సంకేతం ఇచ్చాడు. ఈ  ఘటన అభిమానుల్లో ఆదరణ పొందుతోంది.  ఐదుసార్లు ట్రోఫీ విజేత రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించిన ముంబై టీమ్ మేనేజ్‌మెంట్‌పై అభిమానుల నిరసన కొనసాగుతోంది.హార్దిక్ పాండ్యా అహ్మదాబాద్ స్టేడియంలో అభిమానుల నుండి వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు, ఆ తర్వాత, హైదరాబాద్ మరియు ముంబైతో సహా స్టేడియంలలో అతనిపై అభిమానుల దాడి కొనసాగుతోంది. 80 శాతానికి పైగా అభిమానులు రోహిత్ శర్మ జెర్సీలు ధరించి మైదానానికి రావడంతో ముంబై వారిని అదుపు చేసేందుకు నానా తంటాలు పడుతోంది.

భారత గడ్డపై ఓ భారత ఆటగాడికి ఇంత భారీ వ్యతిరేకత రావడం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే, గత మ్యాచ్‌లో ముంబై జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ బౌండరీ లైన్‌లో ఉండగా నినాదాలు చేయవద్దని అభిమానులను అభ్యర్థించాడు. అయితే అభిమానులు మాత్రం హార్దిక్‌పై ఉన్న వ్యతిరేకతను మాత్రం ఇప్పటి వరకు వీడలేదు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ అవుట్ కాగా, హార్దిక్ పాండ్యా మైదానంలోకి వచ్చాడు. దీంతో ముంబై అభిమానులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీన్ని చూసిన భారత ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా కూడా ఉన్నారు. నిరసనలు విరమించాలని అభిమానులకు సంకేతాలిచ్చారు. విరాట్ కోహ్లీ చేసిన ఈ చర్య అభిమానుల్లో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్, ఆఫ్ఘనిస్థాన్ ఆటగాడు నవీన్ ఉల్ హక్ లను అభిమానులు ఆటపట్టిస్తున్న వేళ విరాట్ కోహ్లీ తన సహచరుడికి మద్దతుగా అభిమానుల మధ్య సంకేతాలు ఇవ్వడం గమనార్హం.

Advertisment
Advertisment
తాజా కథనాలు