BCCI: అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించి బీసీసీఐ తప్పు చేసిందా..? వన్డే వరల్డ్ కప్ ముందు టీమిండియా కెప్టెన్సీ గురించి చర్చ ప్రారంభమైంది. కెప్టెన్‌గా దైపాక్షిక సిరీస్‌ల్లో రాణిస్తున్న రోహిత్ శర్మ ఐసీసీ టోర్నమెంట్‌లో విఫలమవుతున్నాడనే టాక్ వినిపిస్తోంది. By Karthik 17 Aug 2023 in స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Virat Kohli: టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచకప్ ఆడతాడా..? అతనిపై బీసీసీఐ (BCCI) తీసుకున్న నిర్ణయం జట్టుకు నష్టం కల్గించిందా..? కెప్టెన్‌గా రోహిత్ శర్మ విజయం సాధించాడా.? కెప్టెన్‌గా రోహిత్ (Rohit Sharma) విజయవంతమైతే విరాట్ కోహ్లీ టాపిక్ ఎందుకు వస్తోంది.. భారత మాజీ ఆటగాళ్లు ఏమంటున్నారు.? రోహిత్ శర్మ కెప్టెన్సీని ఎందుకు వ్యతికిస్తున్నారు. వన్డే ప్రపంచకప్ టోర్నీకి సమయం దగ్గర పడుతున్న తరుణంలో మాజీలు కెప్టెన్సీ విషయాన్ని మరోసారి ప్రస్తావిస్తున్నారు. విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా కొనసాగించి ఉంటే భారత్‌లో జరిగే మెగా టోర్నీలో టీమిండియా టైటిల్‌ను దక్కించుకునేదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విరాట్ నేతృత్వంలో భారత జట్టు అన్ని విభాగాల్లో సంసిద్ధంగా ఉండేదన్నారు. కాగా విరాట్ కోహ్లీ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న రోహిత్ శర్మ సారథిగా దైపాక్షిక సిరీస్‌ల్లో అదరగొడుతున్నా.. ఐసీసీకి (ICC) సంబంధించిన మెగా టోర్నీలో మాత్రం రాణించలేకపోతున్నాడు. గత సంవత్సరం టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ కెప్టెన్సీలో భారత్ సెమీస్‌లోనే ఇంటిముఖం పట్టిందని, అంతే కాకుండా ఈ ఏడాది జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో (WTC) టీమిండియా ఓటమిపాలైందని గుర్తు చేశారు. విరాట్ కోహ్లీ (Virat Kohli) కెప్టెన్‌గా ఉంటే టీమిండియా 100 శాతం రిజల్ట్స్ సాధించేదంటున్నారు. విరాట్ కోహ్లీకు దూకుడు ఎక్కవంటున్న మాజీ ఆటగాళ్లు.. కానీ టీమ్‌కు న్యాయం చేస్తాడని, భారత్ గెలవడమే తన లక్ష్యమన్నారు. టీమ్ గెలుపుకోసం చివరివరకు పోరాడుతాడని తెలిపారు. అంతే కాకుండా రాబోయే వన్డే వరల్డ్ కప్‌కు భారత్ 100 శాతం సిద్ధంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. మరోవైపు ఇటీవల విండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భారత మేనేజ్‌మెంట్ టీమ్‌లో అనేక మార్పులు చేసిందన్నారు. అందుకే టీమిండియా (Team India) టీ20 సిరీస్‌లో ఓటమి పాలైందన్నారు. భారత టీమ్‌లో ప్రధాన సమస్య 4, 7వ స్థానాలు అన్నారు. 4, 7వ స్థానాల్లో బ్యాటింగ్ వచ్చే ప్లేయర్లు నిలకడగా రాణించలేకపోతున్నారని, ఎవరు ఎప్పుడు ఎలా ఆడుతారో తెలియడం లేదన్నారు. ఆ స్థానాల్లో నిలబడి, ఒత్తిడిని తట్టుకొని రాణించగలిగే ప్లేయర్లు లేరన్నారు. ఈ ఏడాది స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్‌ను టీమిండియా ఎలాగైనా గెలవాలన్నారు. లేకుంటే బీసీసీఐ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించే అవకాశం ఉందని, అతని స్థానంలో మరో ఆటగాడికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు అధికంగా ఉన్నాయన్నారు. గత ఐసీసీ టోర్నీలను పరిశీలిస్తే ఇది కచ్చితంగా జరుగుతుందని వారు జోస్యం చెప్పారు. సెలక్టర్లు ఓపెనర్ల నుంచి లోయరార్డర్ వరకు ఫిట్‌నెస్ సాధించిన వారినే తీసుకోవాలన్నారు. ఫిట్‌నెస్ కలిగియున్న వారిలో సీనియర్లు, జూనియర్లు అనేది చూడవద్దని టైటిల్‌ను సాధించేవారినే ఎంపిక చేయాలని సూచించారు. Also Read: ధావన్‌కి అన్యాయం జరిగింది..టీమిండియాపై రవిశాస్త్రి ఫైర్..!! #virat-kohli #rohit-sharma #kohli #team-india #bcci #captain #world-cup #odi-world-cup #icc-tournaments #kohli-captaincy #captain-virat మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి