Nirmala Sitharaman: పోటీ చేయడానికి పైసలు లేవంటున్న ఆర్థిక మంత్రి నిర్మలా.. అసలు ఆమె ఆస్తులు, అప్పులు ఎన్నో తెలుసా దేశ ఆర్ధిక వ్యవస్థను నడిపిస్తారు. దేశానికి బడ్జెట్ ఎంత కావాలో ఆమెనే నిర్ణయిస్తారు. అలాంటి ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు తన వద్ద లేవని అందుకే పోటీ చేయడం లేదని తెలిపారు. దీంతో ఇప్పుడు నిర్మలమ్మ ఆస్తుల గురించి అంతటా చర్చ జరుగుతోంది. By Manogna alamuru 28 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Nirmala Sitharaman - I don't Have Money to Contest: బీజేపీ కీలక నేత..దేశంలోనే అత్యంత ముఖ్యమైన పదవి...దేశ బడ్జెట్ నిర్ణయించే అధికారం...ఆర్ధికంగా దేశాన్ని నడిపించే సత్తా...ఇన్ని ఉన్నా తన దగ్గర డబ్బులు మాత్రం లేవని చెబుతున్నారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. దాని కారణంగానే ఈసారి ఎన్నికల్లో (Lok Sabha Elections) తాను పోటీ చేయడం లేదని ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి సరిపడా నిధులు లేవని అంటున్నారు. ఇప్పుడు ఈ ప్రకటన పెద్ద చర్చనీయాంశం అయింది. సాధారణంగా రాజకీయ నాయకులకు డబ్బులకు కొదవ ఉండదు. అలాంటిది దేశ మంత్రి అయి ఉండి కూడా నిర్మలమ్మ దగ్గర డబ్బులు ఎలా లేకుండా ఉంటాయని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అందుకే ఆమె ఆస్తుల వివరాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం నిర్మలా సీతారామన్ కర్ణాటక (Karnataka) నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఈసారి కూడా బీజేపీ (BJP) అధిష్టానం నిర్మలా సీతారామన్‌కు రెండు సీట్ల ఆప్షన్ ఇచ్చింది. అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దంగా లేనని ఆమె బుధవారం ఓ కార్యక్రమంలో చెప్పారు. దానికి గల కారణాలు కూడా ఆమె వివరించారు. ఏపీ కానీ, తమిళనాడు నుంచి కానీ నన్ను ఎన్నికల బరిలో నిలవమని జేపీ నడ్డా (JP Nadda) తనకు ఆఫర్ ఇచ్చారని వివరించారు. అయితే ఈ విషయం గురించి నేను 10 రోజులు ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయాన్ని తిరస్కరించానని ఆర్థిక మంత్రి చెప్పారు. నిర్మలా సీతారామన్ ఆస్తుల విలువ.. ప్రస్తుతం నిర్మలా సీతారామన్ ఆస్తుల విలువ ఎంత ఉందంటూ ఆరాలు తీస్తున్నారు. దీని కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. అయితే 2019 ఏడాది ఎన్నికల కమిషన్‌లో దాఖలు చేసిన వివరాల ప్రకారం నిర్మలా సీతారామన్ ఆస్తులు 2 కోట్లకు పైగా ఉంది. అప్పులు 30 లక్షలు ఉన్నాయి. అలాగే పీఎంవో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం 2022కు ఆమె దగ్గర కేవలం రూ. 7,350 మాత్రమే ఉన్నాయి. అవి కాక పలు బ్యాంకుల్లో 35, 52, 666రూ. ఉండగా..పీపీఎఫ్‌లో 1, 59,763 రూ...మ్యూచువల్ ఫండ్స్‌లో 5, 80, 424 రూ. లను ఆమె ఇన్వెస్ట్ చేసినట్టు ఉంది. ఇది కాక ఆమె దగ్గర 18, 46, 987 రూ విలువ చేసే ఆభరణాలు ఉన్నాయి. ఇందులో దాదాపు 315 గ్రాముల బంగారం ఉంది. ఇప్పటీకీ నిర్మల దగ్గర 20 లక్షలకు పైగానే బంగారం ఉందని తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఇల్లు... వీటితో పాటూ ఆర్ధిక మంత్రికి హైదరాబాద్‌లో కూడా ఆస్తులు ఉన్నాయి. ఇక్కడ ఆమెకు విలాసవంతమైన ఇల్లు ఉంది. దీని విలువ 1, 70,51, 400రూ ఉంటుంది. దాంతో పాటూ హయత్‌నగర్‌లో 17,08,800రూ విఉలవ చేసే ల్యాండ్ కూడా ఉందని తెలుస్తోంది. మొత్తానికి నిర్మలా సీతారామన్ దగ్గర రెండు కోటలకు పైగా విలువైన ఆస్తులు ఉండడమే కాకుండా లక్షల రూపాయల అప్పు కూడా ఉంది. ఇది కాక ఆమెకు హౌస్ లోన్లు లాంటివి కూడా ఉన్నాయని చెబుతున్నారు. అది నా డబ్బు కాదు... అయితే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధి ఇంత ఖర్చు పెట్టాలని రూలేమీ ఉండదు. కానీ గరిష్టంగా 95 లక్షలు ఖర్చు చేయవచ్చును. ఇది రూల్ ప్రకారం చేస్తే...అలా కాకుండా ఇప్పటి రాజకీయ నాయకులు లెక్కు మించి కోట్లకు కోట్లు ఎన్నికల కోసం ఖర్చు పెడుతున్నారు. అవన్నీ లెక్కల్లోకి రాకుండా జాగ్రత్తపడుతున్నారు. ఎందుకంటే ఎన్నికల కోసం ఖర్చు పెట్టిన డబ్బుల వివరాలను అభ్యర్ధులు చెప్పవలసి ఉంటుంది.అవి ఎక్కడ నుంచి వచ్చాయో మెన్షన్ తప్పనిసరిగా చేయాలి. అభ్యర్థుల ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ ఫండ్స్ నుంచి డబ్బులు తీసుకుంటారు. కానీ నిర్మలా సీతారామన్ ఆ అవకాశాన్ని కూడా వద్దనుకుని ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. దేశానికి సంబంధించిన డబ్బు నాది కాదు అంటూ ఆమె చెబుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికీ ప్రచారంలో మాత్రం పాల్గొంటానని ఆమె వివరించారు. పోటీలో నిలిచిన అభ్యర్థుల తరపున ప్రచారానికి వెళ్తానని ఆమె చెప్పారు. Also Read:Delhi High Court: కేజ్రీవాల్‌కు ఊరట..జైలు నుంచి పరిపాలన చేయోచ్చు అని చెప్పిన ఢిల్లీ హైకోర్టు #bjp #elections #lok-sabha-elections-2024 #nirmala-sitharaman #finance-minister మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి