Stock Market Today: నీరసంగా మొదలైన దేశీయ మార్కెట్లు సోమవారం ఉదయం ఉత్సాహంగా మొదలవ్వాల్సిన దేశీయ మార్కెట్లు నీరసంగా ఆరంభం అయ్యాయి. ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ 205 పాయింట్ల నష్టంతో 66,077 దగ్గర, నిఫ్టీ 48 పాయింట్ల నష్టపోయి 19,072 దగ్గర ట్రేడవుతున్నాయి. By Manogna alamuru 16 Oct 2023 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి Stock Market Today: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేవీయ మార్కెట్లు నష్టాలతో ఆరంభం అయ్యాయి. ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ (Sensex) 205 పాయింట్ల నష్టంతో 66,077 దగ్గర, నిఫ్టీ (Nifty) 48 పాయింట్ల నష్టపోయి 19,072 దగ్గర ఉన్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.26 దగ్గర ప్రారంభం అయింది. సెన్సెక్స్ సూచీలో హెచ్సీఎల్ టెక్, ఙన్ఫోసిస్, మారుతీ, ఎన్టీపీసీ, ఎంఅండ్ఎం, భారతీ ఎయిర్ టెల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, టైటన్, టాటా స్టీల్స్, టీసీఎస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్, ఇండస్ఇండ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా, పవర్ గ్రిడ్, బజాజ్ ఫిన్ సర్వ్, సన్ ఫార్మా, హెచ్యూఎల్, ఎసీబీఐ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అంతకు ముందు శుక్రవారం అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగిసాయి. టెక్ స్టాక్స్ లో అమ్మకాల సెగ సూచీలను కిందకు లాగాయి. ఐరోపా మార్కెట్లు కూడా అదే బాటలో పయనించాయి. గాజాలో ఇజ్రాయెల్ దాడులు మదుపర్లను భయపెడుతున్నాయి. Also Read:అమరావతి అసైన్డ్ భూముల కేసు వాయిదా మరోవైపు రూపాయి రికార్డు కనిష్ట స్థాయికి పడిపోతోంది. దీనికి అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank) చర్యలు తీసుకుంటుందని తెలుస్తోంది. దేశీయంగా ఉన్న డాలర్ రిజర్వ్ లను విక్రయించి రూపాయి విలువ స్థిరపరిచేలా చర్యలు తీసుకుంటారని అంటున్నారు. అయితే రిజర్వ్ బ్యాంక్ దగ్గర డాలర్ నిల్వలు భారీ స్థాయిలో ఉండడం బలాన్ని ఇస్తోంది. ప్రస్తుతం 83.26 దగ్గర ఉన్న రూపాయి మారకం విలువ 83.24 దగ్గరకు రాగానే ఆర్బీఐ (RBI) చర్యలు తీసుకుంటుంది. తగ్గేదేలే అంటున్న బంగారం... ఇక బంగారం (Gold) కొనుగోలు చేసే వారికి ఇవాళ స్వల్ప ఊరట లభించింది. బంగారం ధర గ్రాముకు స్వల్పంగా పెరిగింది. మరోవైపు.. వెండి రేటు మాత్రం ఇవాళ స్థిరంగా ఉంది.అంతర్జాతీయ మార్కెట్లో క్రితం సెషన్‌లో బంగారం ధర భారీగా పెరిగింది. అయితే, ఇవాళ గోల్డ్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1923 డాలర్ల వద్ద స్థిరంగా ట్రేడింగ్ అవుతోంది. మరోవైపు.. స్పాట్ సిల్వర్ రేటు ఒక ఔన్సుకు ప్రస్తుతం 22.61 డాలర్ల వద్ద అమ్ముడవుతోంది. ఇవాళ డాలర్‌తో పోలిస్తే రూ. 83.300 వద్ద అమ్ముడవుతోంది.హైదరాబాద్‌లో ఇవాళ బంగారం రేట్లు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.10 పెరిగి ప్రస్తుతం రూ. 55 వేల 41 వేల వద్ద ఉంది. అలాగే 24 క్యారెట్ల గోల్డ్ రేటు తులానికి రూ. 10 పెరిగి రూ. 60 వేల 450 వద్ద ట్రేడింగ్ అవుతోంది.కిలో వెండి ధర మన హైదరాబాద్‌లో రూ. 77 వేల మార్క్ వద్ద స్థిరంగా కొనసాగుతోంది. #stock-market-today #shares #sensex #nifty మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి