Telangana Budget: గురువారం తెలంగాణ బడ్జెట్‌.. వ్యయం అంచనా ఎంతంటే

గురువారం తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. రూ.2 లక్షల 50 వేల కోట్లతో బడ్జెట్ ఉంటుందని తెలుస్తోంది. రుణమాఫీకి, రైతు భరోసాకు ఎక్కువ కేటాయింపులు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

New Update
Telangana Budget: గురువారం తెలంగాణ బడ్జెట్‌.. వ్యయం అంచనా ఎంతంటే

Telangana Budget 2024: గురువారం తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. రూ.2 లక్షల 50 వేల కోట్లతో బడ్జెట్ ఉంటుందని తెలుస్తోంది. ఈసారి రుణాల సేకరణలతో పాటు రాష్ట్ర ఆదాయం పెరుగుతున్నందున బడ్జెట్‌పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. కేంద్ర గ్రాంట్లతో పాటు అప్పుల రూపంలో రూ.60 వేల కోట్లు వచ్చే ఛాన్స్ ఉంది.

Also Read: బర్త్‌ డే సందర్భంగా మంచి మనసు చాటుకున్న కేటీఆర్..

రైతు రుణమాఫీకి, రైతు భరోసాకు ఎక్కువ కేటాయింపులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే విద్య, వైద్యానికి ఇంపార్టెన్స్‌ ఇస్తారని సమాచారం. మూసీ రివర్ ఫ్రంట్‌ బ్యూటిఫికేషన్‌తో పాటు హైడ్రాకు కూడా రేవంత్ సర్కార్‌ భారీగా నిధులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Also Read: ఈ సారి గోల్డ్ కొడతారా.. టీమిండియా హాకీ జట్టుపై కోటి ఆశలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు