Bhatti Vikramarka : కేసీఆర్ పాలన అంతా అస్తవ్యస్థమే.. భట్టి ఫైర్..

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలోనే శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల హయాంలో అంతా అస్తవ్యస్థమేనని.. రాష్ట్రం వెనుకబడిందంటూ మండిపడ్డారు. కేసీఆర్‌ పాలనలో ఫ్యూడల్‌ వ్యవస్థ ఏర్పడిందంటూ ధ్వజమెత్తారు.

New Update
Runa Mafi: రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్

Bhatti Fire On KCR : తెలంగాణలో కాంగ్రెస్(Telangana Congress) ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. సీఎంగా రేవంత్‌ రెడ్డి(Revanth Reddy) తో పాటు మరో 11 మంది మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత.. మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేయడం, ఆరోగ్య శ్రీ పథకం కింద రూ.10.లక్షలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. త్వరలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని చెప్పారు. అలాగే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో అంతా అస్తవ్యస్థమేనని.. రాష్ట్రం వెనుకబడిందంటూ మండిపడ్డారు. కేసీఆర్‌ పాలనలో ఫ్యూడల్‌ వ్యవస్థ ఏర్పడిందంటూ ధ్వజమెత్తారు. నియంతృత్వ పాలకు ప్రజలు చరమగీతం పాడారని.. తమ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థ ప్రజల కోసమే పనిచేసేలా చేస్తామని పేర్కొన్నారు.

Also Read: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. అప్పట్లో బిల్లుపై ఏ పార్టీ ఎలా వ్యవహరించిందో తెలుసా?

మరోవైపు.. తాము హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీలను రెండు రోజుల్లోనే అమలు చేశామన్నారు. మిగతా ఆరు గ్యారంటీలను 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పారు. అలాగే ఐటీ, పరిశ్రమలు, సేవా రంగాలను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో కూడా ప్రజా దర్బార్‌లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఆరు గ్యారెంటీలకు వారంటీ లేదని చెప్పిన బీఆర్‌ఎస్‌ నేతలకు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. ఇదిలా ఉండగా.. భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంతో పాటు ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన ఆర్థిక పరిస్థితిపై సమీక్ష చేశారు. అయితే ఇప్పుడు త్వరలోనే దీనికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పారు.

Also Read: నాగర్ కర్నూల్‌లో నర హంతకుడు.. 20 మందిని చంపి..?

Advertisment
Advertisment
తాజా కథనాలు