Delhi : డాన్స్ చేస్తూ గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

ఢిల్లీలోని రూప్ నగర్ పోలీస్‌ స్టేషన్‌లో సీనియర్ ఆఫీసర్ బదిలీ అయి వెళ్ళిపోతున్నారు. ఆయనకు టీమ్ మొత్తం వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో డాన్స్ చేస్తూ హెడ్ కానిస్టేబుల్ ఉన్నట్టుండి పడిపోయారు. గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందారు.

New Update
Delhi : డాన్స్ చేస్తూ గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

Constable Ravi Kumar : ఢిల్లీ (Delhi) లో రూప్‌నగర్ పోలీస్ స్టేషన్‌లోజరిగిన ఘటన అక్కడ అందరినీ తీరని దు:ఖంలోకి నెట్టేసింది. ఈ స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు రవికుమార్‌. స్టేషన్‌ హౌస్‌ అధికారి (ఎస్‌హెచ్‌వో) బదిలీ కావడంతో స్టాఫ్ అంతా కలిసి సెండాఫ్​ పార్టీ ఇచ్చారు. దీనిలో పోలీసులందరూ ఉత్సాహంగా పాటు పాడుతూ, డాన్స్‌లు చేశారు. రవికుమార్‌ కూడా సరదాగా డ్యాన్స్‌ చేశారు. ఈ క్రమంలో ఆయనకు ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. ఏమైందో తెలియక అతనిని తోటి ఉద్యోగులు అతనిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ రవికుమార్‌‌ను పరీక్షించిన వైద్యులు.. అతను‌ చనిపోయినట్లు ప్రకటించారు. దీంతో అతని మిత్రులతో పాటూ సీనియర్ అధకారులు సైతం ఒక్కసారి షాక్‌ గురైయ్యారు. తమతో పాటూ వర్క్ చేస్తూ...పార్టీలో సరదాగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా చనిపోవడం వారు జీర్ణించుకోలేకపోయారు.

రవికుమార్ 2010లో ఢిల్లీ పోలీస్‌గా విధుల్లో జాయిన్ అయ్యారు. ఇతని వయసు 35 ఏళ్ళు. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 45 రోజుల క్రితమే గుండె పని తీరును తెలిపే యాంజియోగ్రఫీ చేయించుకున్నారు. అప్పుడు ఏ లోపం లేదని కూడా తెలిసింది. కానీ ఇంతలోనే నేను ఇక పని చేయలేను అంటూ ఆగిపోయింది. రవి కుమార్ ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) బాగ్‌పత్‌కు చెందిన వ్యక్తి. దీని తర్వాత రవి చేసిన డాన్స్ వీడియోలు (Dance Videos) ఇప్పుడు సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అయ్యాయి.

Also Read: Paris : పారా ఒలింపిక్స్‌లో అదరగొట్టిన ఆర్మ్‌ లెస్ ఆర్చర్ శీతల్ దేవి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

IPL 2025: చరిత్ర సృష్టించిన ఓపెనర్ అభిషేక్ శర్మ

ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 8 వికెట్ల తేాడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కేవలం 55 బంతుల్లో 141 పరుగులు చేశాడు. అయితే ఐపీఎల్‌లో అత్యధిక స్కోర్ చేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు.  

New Update
ipl

Abhishek Sharma

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు వరుస నాలుగు మ్యాచ్‌ల ఓటమి తర్వాత విజయాన్ని సాధించింది. పంజాబ్ కింగ్స్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంకా 9 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఓపెనర్ అభిషేక్ శర్మ సెంచరీ ఇన్నింగ్స్ ఆడి రికార్డులు సృష్టించాడు. కేవలం 55 బంతుల్లో 141 పరుగులు చేయగా.. అందులో 10 సిక్సర్లు, 14 ఫోర్లు ఉన్నాయి. అయితే ఇది ఐపీఎల్‌లో అత్యధిక స్కోర్ చేసిన మూడో బ్యాట్స్‌మన్. అలాగే ఐపీఎల్ మ్యాచ్‌లో అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన భారత బ్యాట్స్‌మన్‌గా కూడా అభిషేక్ నిలిచాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 132 పరుగులు చేసిన కెఎల్ రాహుల్ రికార్డును అభిషేక్ బద్దలు కొట్టాడు. 

ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

ఇది కూడా చూడండి: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

IPLలో అత్యధిక స్కోర్లు

175- క్రిస్ గేల్ (RCB) vs PWI, 2013
158- బ్రెండన్ మెకల్లమ్ (KKR) vs RCB, 2008
141- అభిషేక్ శర్మ (SRH) vs PBKS, 2025
140- క్వింటన్ డి కాక్ (LSG) vs KKR, 2022
133- AB డివిలియర్స్ (RCB) vs MI, 2015

ఇది కూడా చూడండి: TS: భూభారతిపై అవగాహనా సదస్సులు..సీఎం రేవంత్ రెడ్డి

Advertisment
Advertisment
Advertisment