David Warner: ఆస్ట్రేలియా.. కోచ్ గా డేవిడ్ వార్నర్!

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ భవిష్యత్తులో కోచ్ గా పనిచేయాలనుకుంటున్నట్లు చెప్పారు. 'ఇది నా డ్రీమ్. నేను కోచ్ బాధ్యతలు చేపడితే క్రికెట్ మరింత డైనమిక్ గా మారుతుందని భావిస్తున్నా. కానీ మరికొంత కాలం నేను కుటుంబానికి దూరం కావడం నా భార్య ఒప్పుకుంటుందో లేదో అడగాలి' అన్నారు.

New Update
David Warner: ఆస్ట్రేలియా.. కోచ్ గా డేవిడ్ వార్నర్!

David Warner:  ఆస్ట్రేలియా (Australia) క్రికెట్ స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ తన భవిష్యత్తు ప్రణాళికపై ఓపెన్ అయ్యారు. ఇటీవలే టెస్ట్ (Test), వన్డే (ODI)ఫార్మట్ నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించిన ఆయన.. టీ20ల్లో మాత్రం మరికొంతకాలం కొనసాగుతాననని చెప్పారు. అయితే పాకిస్థాన్ తో టెస్ట్ సిరీస్ ముగిసిన ఆనంతరం స్వదేశానికి వెళ్లిన ఆయన.. రీసెంట్ గా ఓ ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

నా డ్రీమ్ ..
ఈ మేరకు తాను క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకున్న తర్వాత కోచ్‌గా (Coach) మారాలనుకుంటున్నట్లు తెలిపాడు. 'నాకు ఒక డ్రీమ్ ఉంది. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కోచ్‌గా పని చేయాలనుకుంటున్నా. ఈ విషయంపై ఫస్ట్ నా భార్యతో మాట్లాడాలి. ఇంకొంత కాలం ఇంటికి దూరంగా ఉండేందుకు అనుమతిస్తుందో లేదో చూడాలి. జట్టులోకి వచ్చిన కొత్తలో మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్ల ముఖాల్లోకి చూసేవాడిని. వారు బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు కలవరపెట్టడం ద్వారా లయను దెబ్బతీసేవాడిని. జట్టు నన్ను అలాగే తీర్చిదిద్దింది. ఇకపై అలాంటి స్లెడ్జింగ్‌ చూస్తారని అనుకోను. వచ్చే అయిదు, పదేళ్లలో అంతా మారిపోతుంది. స్లెడ్జింగ్‌ కంటే గెలవడంపైనే ఎక్కువ దృష్టిసారిస్తారు. ఐపీఎల్‌ వంటి దేశీయ లీగ్‌లలో వివిధ దేశాల ఆటగాళ్లు డ్రెస్సింగ్‌ రూమ్‌లు పంచుకుంటుండటంతో పదేళ్లలో స్లెడ్జింగ్‌ దూరమవుతుందని భావిస్తున్నా' అని వార్నర్ వెల్లడించారు. అలాగే తాను కోచ్ గా ఉంటే, మొత్తం డైనమిక్ మారుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి : Contraceptive Pills: గర్భనిరోధక మాత్రలు తీసుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!

కన్నీటి వీడ్కోలు..
ఇక 37 ఏళ్ల వార్నర్ శనివారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో తన చివరి టెస్టు మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. 'విజయంతో నా కెరీర్ ముగిసినందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నా. కొంత మంది గొప్ప క్రికెటర్లతో కలిసి ఆస్ట్రేలియా తరఫున ఆడే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. అన్ని సందర్బాల్లోనూ నా వెన్నంటి నిలిచిన నా భార్యకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్న తక్కువే. గత రెండేళ్లుగా ఆస్ట్రేలియా టీమ్ అద్భుతంగా ఆడుతోంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్, యాషెస్ సిరీస్ డ్రా, ప్రపంచకప్ విజయాల్లో భాగమైనందుకు గర్వ పడుతున్నా' అంటూ వార్నర్ భావోద్వేగానికి గురయ్యారు. పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. 111 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన వార్నర్ 44.5 సగటుతో 8695 పరుగులు చేశాడు. అందులో 3 డబుల్ సెంచరీలు, 26 శతకాలు, 56 అర్ధ శతకాలు ఉన్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Renu Desai: నాకు రాజకీయాల్లోకి రావాలని ఉంది..రేణూ దేశాయ్

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. దేశంలో జరిగే అన్ని విషయాలపైనా స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె..తనకు రాజకీయాల్లోకి రావాలని ఉందని చెప్పారు. 

New Update
Renu Desai

Renu desai

తనకు రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం ఇంతకు ముందే వచ్చిందని..కానీ పిల్లలు చిన్నవారు కావడం వలన వదులుకున్నానని చెప్పారు రేణూ దేశాయ్. రాజకీయాల్లోకి వెళ్ళడం తన జాతకంలోనే ఉందని అన్నారు. ఇప్పటికీ తనకు అదే కోరికని...కానీ తాను విధి రాతకు వ్యతిరేకంగా ప్రయాణిస్తున్నానని చెప్పుకొచ్చారు రేణు. ఓ పాడ్ కాస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులో మాటను బయటపెట్టారు.  సామాజిక సేవ చేయడం అంటే తనకు ఆనందమని...ఏ చిన్నారీ ఆకలితో ఉండకూడదని అనుకుంటానని ఆమె తెలిపారు. అయితే తాను కొంచెం ముక్కు సూటి మనిషిని...స్నేహితులు, పిల్లలతో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తానని...అందుకే వారు తాను పోలిటిక్స్ లో పనికి రానని అంటారని నవ్వూతూ చెప్పారు రేణూ దేశాయ్. 

మోడీ భక్తురాలిని..బీజేపీకే సపోర్ట్..

తాను ఎప్పటికీ మోడీనే సపోర్ట్ చేస్తానని...ఆమె భక్తురాలిని అని నిర్భయంగా చెప్పుకున్నారు రేణు. మన ధర్మం ఎలా బతకాలో, ఎలా నడుచుకోవాలో నేర్పించింది. అందుకే నేను సనాతురాలినే అని చెప్పుకుంటాననన్నారు ఎవరేం అనుకున్నా ఎప్పటికీ తాను బీజేపీకే సపోర్ట్ చేస్తానని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులా తాను ఏదైనా పార్టీలో చేరితే కచ్చితంగా అందరికీ చెప్పే చేస్తానని రేణూ దేశాయ్ అన్నారు. ఇక ఆమె కుమారుడు అకీరా నందన్ గురించి చెబుతూ...ఓజీ సినిమాలో అతను పని చేయడం లేదని తెలిపారు. అకీరా నటన గురించి ఆలోచించిన రోజే నా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెడతా. కొందరు యూట్యూబర్లు మనీ కోసం తప్పుడు థంబ్‌నైల్స్‌ పెడుతున్నారు రేణూ ఆరోపించారు. 

today-latest-news-in-telugu | renu-desai | actress | inter-view

Also Read: WHO: మరో మహమ్మారి తప్పదు-WHO చీఫ్

Advertisment
Advertisment
Advertisment