ఎమ్మెల్యే మైనంపల్లిపై విమర్శలు మంత్రి హరీష్ రావుపై ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన విమర్శలపై బీఆర్ఎస్ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. హరీష్ రావును విమర్శించే స్థాయి హనుమంతవురావుకు లేదని సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ కార్యకర్తలు మండిపడుతున్నారు. By Karthik 21 Aug 2023 in రాజకీయాలు మెదక్ New Update షేర్ చేయండి మంత్రి హరీష్ రావుపై ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన విమర్శలపై బీఆర్ఎస్ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. హరీష్ రావును విమర్శించే స్థాయి హనుమంతవురావుకు లేదని సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ కార్యకర్తలు మండిపడుతున్నారు. ప్రజల ప్రేమను పొందిన హరీష్ రావు గత ఎన్నికల్లో 1.20 లక్షల మెజారిటీతో విజయం సాధించారని గుర్తు చేశారు. డబ్బుతో ప్రేమను కొనలేవని మైనంపల్లిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనంపల్లి సిద్దిపేటలో పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కించుకోలేరని స్పష్టం చేశారు. కాగా మంత్రి హరీష్ రావుకు మెదక్‌లో పనేంటని మల్కాజ్‌గిరి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్కాజ్‌గిరి నుంచి తాను, మెదక్ నుంచి తన కుమారుడు పోటీ చేస్తామని ఆయన ప్రకటించారు. మెదక్‌లో హరీష్ రావు పెత్తనం చెలాయించాలని చూస్తున్నారన్న ఆయన.. హరీష్ రావు తన పద్దది మార్చుకోకపోతే తాను సిద్దిపేటలో పోటీ చేసి తన తడాఖా చూపిస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు అడ్రస్‌ను గల్లంతు చేస్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ బీఆర్‌ఎస్ నేతల్లో అనేక మంది కుటుంబ సభ్యులకు టికెట్ ఇచ్చారన్న మైనంపల్లి.. తనకు, తన కుమారుడికి టికెట్ ఇస్తేనే తాము పోటీ చేస్తామని తేల్చి చెప్పారు. కోవిడ్ సమయంలో తన కుమారుడు ఎంతో ప్రజాసేవ చేశాడని.. దాదాపు 8 కోట్లు సొంత డబ్బు ఖర్చు చేసి కరోనా పేషెంట్లను ఆదుకున్నాడని వెల్లడించారు. మెదక్‌లో హరీష్ రావు నియంతలా వ్యవహరిస్తోన్నారని మైనంపల్లి ఆరోపించారు. హరీష్ రావు తన గతం గుర్తుంచుకోవాలని.. సిద్దిపేట వలే మెదక్‌ను ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. వచ్చేసారి తాను సిద్దిపేటలో పోటీ చేస్తానన్నారు. హరీష్ రావుకు వ్యతిరేకంగా నిలబడి గెలిస్తే ఆయన ముఖం ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. కాగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన లిస్ట్‌లో తండ్రీ కొడుకులకు స్థానం దక్కకపోవడం గమనార్హం #brs #kcr #siddipet #tickets #mla #medak #minister #harish-rao #sensational-comments #hanumantha-rao #malkajgiri మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి