క్రైం Hyderabad: ఓయో హోటల్లో సీక్రెట్ కెమెరాలు.. నిందితుడి ఫోన్లో వందల న్యూడ్ వీడియోలు..! శంషాబాద్ సిటా గ్రాండ్ ఓయో హోటల్ లో సీక్రెట్ కెమెరాలు కలకలం రేపాయి. బెడ్ రూంలలో సీక్రెట్ కెమెరాలు ఉంచి జంటల అశ్లీల దృశ్యాలను రికార్డు చేసి నిర్వాహకుడు డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడి ఫోన్లో వందల న్యూడ్ వీడియోలు బయటపడ్డాయి. By Jyoshna Sappogula 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kolkata: అభయ అత్యాచార కేసులో పోలీసుల హస్తం? వెలుగులోకి విస్తుపోయే నిజాలు! జూనియర్ డాక్టర్ అభయ అత్యాచారం కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. నిందితుడు సంజయ్ రాయ్‌తో పోలీసులకు సన్నిహిత సంబంధాలున్నట్లు సీబీఐ విచారణలో వెలుగులోకి వచ్చింది. పోలీస్ కమిషనర్ పేరుతో రిజిస్టర్ అయిన బైక్‌పైనే తిరుగుతున్నట్లు సంజయ్ అంగీకరించాడు. By srinivas 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TG News: ఖమ్మంలో పగిలిన తలలు.. తీవ్ర ఉద్రిక్తత ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెలుగుమట్ల రెవెన్యూ విలేజ్‌లో ఆవాసాలు ఏర్పాటు చేసుకున్న వారికి, యజమానులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురి తలలు పగలడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. By Vijaya Nimma 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం KTR: చెల్లి కోసం ఢిల్లీలో ఆటో ఎక్కిన కేటీఆర్.. వీడియో వైరల్! కవిత బెయిల్ ప్రక్రియను సాయంత్రంలోగా పూర్తి చేసేందుకు కేటీఆర్ హడావుడిగా సుప్రీం కోర్టు నుంచి తిహార్ జైలుకు బయల్దేరారు. ఈ క్రమంలో ట్రాఫిక్ సమస్యను తప్పించుకునేందుకు తన కారు దిగి ప్యాసింజర్ ఆటో ఎక్కారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. By srinivas 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kolkata case: కోల్‌కతాలో తీవ్ర ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు రువ్విన విద్యార్థులు! అభయ అత్యాచార ఘటనపై కోల్‌కతాలో విద్యార్థులు చేపట్టిన నిరసన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తంగా మారింది. సచివాలయ ముట్టడిని పోలీసులు అడ్డుకోగా స్టూడెంట్స్ రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతోపాటు గాల్లోకి కాల్పులు జరిపారు. ర్యాలీని అడ్డుకోవద్దని గవర్నర్ ఆనంద్ సూచించారు. By srinivas 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Sri Lanka : తమిళనాడు మత్స్యకారులను అరెస్ట్ చేసిన శ్రీలంక నేవీ! శ్రీలంక సముద్ర జలాల్లో చేపల వేటను సాగిస్తున్న ఎనిమిది మంది మత్స్యకారులను శ్రీలంక నేవీ అరెస్ట్ చేసింది.అంతర్జాతీయ సముద్ర సరిహద్దు దాటినందుకు శ్రీలంక నేవీ పెట్రోల్ బోట్లు వారిని చుట్టుముట్టి.. ఎనిమిది మంది మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నాయి. By Bhavana 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Medchal : వేగంగా వచ్చి బైక్ ని ఢీకొట్టిన కారు.. తండ్రి మృతి..కూతురికి తీవ్రగాయాలు! మేడ్చల్ లో యూటర్న్ తీసుకుంటున్న బైక్ ను ఓ కారు అతివేగంతో వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ మీద ఉన్న తండ్రి పంకజ్ అక్కడికక్కడే మరణించగా...కుమార్తె పూజ తీవ్రంగా గాయపడింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. By Bhavana 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kakinada: గురుకుల బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.... 20 మంది విద్యార్థులకు అస్వస్థత! ఏలేశ్వరం బాలయోగి గురుకుల బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఈ ఘటనలో 20 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు అధికారులు తెలిపారు. వంటశాల అపరిశుభ్రంగా ఉండటమే ఈ ఫుడ్ పాయిజన్ కి కారణం అయి ఉంటుందని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. By Bhavana 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Maharashtra: కూలిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం.. సీఎం ఏక్నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలడంపై సీఎం ఏక్నాథ్ షిండే స్పందించారు. విగ్రహం కూలడం దురదృష్టకరమన్నారు. బలమైన గాలుల కారణంగా విగ్రహం కూలిపోయిందన్నారు. అదే స్థలంలో శివాజీ విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠిస్తామని ఏక్నాథ్ షిండే తెలిపారు. By Jyoshna Sappogula 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn