Karnataka Murder : భర్తను హత్య చేసి.. గుండెపోటుగా డ్రామా: భార్య, ప్రియుడు అరెస్ట్.

కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. తుమకూరు జిల్లాలో చోటుచేసుకున్న ఓ మరణం ఇప్పుడు సంచలనంగా మారింది. మందుగా గుండెపోటుతో చనిపోయాడని అందరూ భావించిన పరమేష్ అనే వ్యక్తి మరణం వెనుక భయంకరమైన కుట్ర దాగి ఉందని పోలీసులు ఛేదించారు.

New Update
crime

కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. తుమకూరు జిల్లాలో చోటుచేసుకున్న ఓ మరణం ఇప్పుడు సంచలనంగా మారింది. మందుగా గుండెపోటుతో చనిపోయాడని అందరూ భావించిన పరమేష్ అనే వ్యక్తి మరణం వెనుక భయంకరమైన కుట్ర దాగి ఉందని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో పరమేష్ భార్య ఆశను, ఆమె ప్రియుడు చంద్రప్పను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఇంతకు ఏం జరిగిదంటే..  

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..  2026 జనవరి 30వ తేదీన పరమేష్ హఠాత్తుగా మరణించాడు. ఆ సమయంలో అతని భార్య ఆశ, తన భర్తకు గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులను నమ్మించింది. అందరూ ఆమె ఏడుపు చూసి నిజమే కావచ్చు అని నమ్మేశారు. దీంతో ఎవరికీ అనుమానం రాకుండా హుటాహుటిన పరమేష్ అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. అంతా సవ్యంగానే సాగిపోతుందని భావిస్తున్న క్రమంలో ఆశ చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. భర్త చనిపోయిన కేవలం 20 రోజుల్లోనే ఆమె తన స్నేహితుడైన చంద్రప్పను పెళ్లి చేసుకుంది.

రెండో పెళ్లి చేసుకోవడంతో అనుమానం 

భర్త చనిపోయిన కొద్ది రోజులకే ఆశ రెండో పెళ్లి చేసుకోవడంతో పరమేష్ సిస్టర్స్ కు పెద్ద అనుమానమే వచ్చింది. తమ తమ్ముడి మరణం వెనుక ఏదో మోసం ఉందని భావించిన వారు హెబ్బూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తహసీల్దార్, రెవెన్యూ అధికారుల సమక్షంలో ఖననం చేసిన పరమేష్ మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం నిర్వహించారు. ఫోరెన్సిక్ పరీక్షల కోసం నమూనాలను కూడా సేకరించారు.

పోలీసులు గట్టిగా విచారించగా

అనంతరం ఆశను, ఆమె భర్త చంద్రప్పను పోలీసులు గట్టిగా విచారించగా అసలు నిజం బయటపడింది. ఆశ, చంద్రప్ప కలిసి పరమేష్‌ను దిండుతో ఊపిరాడకుండా చేసి చంపినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. ఆ తర్వాత దానిని గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశామని వారు ఒప్పుకున్నారు. ప్రస్తుతం నిందితులిద్దరినీ పోలీసులు జైలుకు పంపారు. ఈ ఘటనపై హెబ్బూరు పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు