మేడ్చల్ లో ఘోర ఘటన చోటుచేసుకుంది. 25 ేళ్ళ యువతిని గుర్తు తెలియని వ్యక్తులు దారుంగా చంపేశారు. బండరాళ్ళతో కొట్టి హత్య చేశారు. ఆ తరువాత మృతదేహంపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. అంతరం ఓఆర్ఆర్ కాజ్ వే కింద పడేసి వెళ్ళిపోయారు. దిశ తరహాలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి వివరాలు ఇంకా తెలియలేదు. ఆమె ఎవరూ, ఇక్కడకు ఎలా వచ్చిందీ, ఎవరితో వచ్చిందీ తెలుసుకునేందుకు పోలీసులు పరిశోధన ముమ్మరం చేశారు. దీంతో ఇప్పుడు మృతురాలి పోస్ట్ మార్టం రిపోర్ట్ కీలకంగా మారనుంది.
రేప్ చేసి..చంపేశారు..
యువతిని దారుణంగా చంపారని తెలుస్తోంది. ఓఆర్ఆర్ కాజ్ వే కింద ఆమెను పడేసిన రెండు గంటల తర్వాత మృతదేహం గురించి పోలీసులకు సమాచారం అందించారు. యువతి ఎవరో గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఆమె మొహం మీద దుండగులు చితకబాదారు. కొంచెం కూడా ఆనవాళ్ళు కనిపించడం లేదు. దానికి తోడు ఆమెను కాల్చి పడేశారు. అది కూడా చాలా వికృతంగా చేశారని తెలుస్తోంది. పెట్రోల్ లేదా కిరసనాయిల్ తో మృతదేహాన్ని కాల్చడం కాకుండా చిన్న లైటర్ తో ఆమె ముఖాన్ని కాల్చారని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు యువతిని దుండగులు రేప్ చేసి చంపారనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అందుకు నిదర్శనంగా యువతి వంటిపై బట్టలు సరిగ్గా లేవని చెబుతున్నారు. ఆమె ప్రవైట్ పార్ట్ దగ్గర దుస్తులు లేవని...దాన్ని బట్టి రేప్ కచ్చితంగా జరిగిందనే నిర్ధారణకు రావచ్చని అంటున్నారు. దానికితోడు యువతి చేతి మీద ఇద్దరి పేర్లు కనిపించాయి. శ్రీకాంత్, నరేంద్ర అనే పేర్లు ఆమె చేతిపై స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీటి ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అన్నింటి కంటే యువతి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఈ కేసులో కీలకం కానుంది. అది వస్తే చాలా వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.
Also Read: USA: అమెరికాలోనే చరిత్రలోనే అతి పెద్ద ఏరివేత..వైట్ హౌస్