/rtv/media/media_files/2025/01/24/C68krKuJDphyUcbaalBu.jpg)
Young woman murder
Young woman murder : మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. 25 ఏళ్ల యువతి దారుణహత్యకు గురైంది. యువతిని బండరాళ్లతో కొట్టిచంపి అనంతరం పెట్రోల్ పోసి తగులబెట్టారు. కాలిన శరీరభాగాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నపోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురు స్పాట్
తెలంగాణలో వరుస హత్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. మహిళలను దారుణంగా చంపుతున్న ఘటనలు వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి. నిన్నటికి నిన్న రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గురుమూర్తి అనే వ్యక్తి తన భార్యను అతి దారుణంగా హత్య చేయడంతో పాటు శరీరభాగాలను ముక్కలుగా చేసి కుక్కర్ లో ఉడికించాడు. అనంతరం ఆ ముక్కలను ఎండలో ఆరబెట్టి పొడిగా మార్చి చెరువులో పడేశాడు. ఈ దారుణ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.
ఈ సంఘటన ఇలా ఉండగానే 25 ఏళ్ల యువతిని బండరాళ్లతో కొట్టి చంపడంతో పాటు పెట్రోల్ పోసి తగలబెట్టడం కలకలం రేపింది. కాగా మృతురాలు ఎవరు? ఆమెను రేప్ చేసి హత్య చేశారా? లేక ఇతర కారణాలతో హత్యచేశారా? యువతిని అక్కడే చంపి తగలబెట్టారా? లేక వేరేచోట చంపి ఇక్కడికి తీసుకువచ్చి తగల బెట్టారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా మేడ్చల్ జిల్లాలో మిస్సింగ్ కేసులను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. మృతురాలి చేతిపై శ్రీకాంత్, నరేందర్ అని రాసి ఉందని తెలిపారు. యువతిపై అత్యాచారం జరిగిందా లేదా అనేది పోస్ట్ మార్టంలో తేలుతుందని పోలీసులు తెలిపారు.యువతిని హత్య చేయడానికి కారణాలు ఏంటీ అనే విషయంలో పోలీసులు విచారణ చేపట్టారు. త్వరలోనే ఈ కేసును ఛేదిస్తామని పోలీసులు తెలిపారు.