/rtv/media/media_files/2025/02/22/ucaH8r0iWvlbpxaJO5aS.jpg)
బెంగళూరు (Bengaluru) లోని కోరమంగళ ప్రాంతంలో ఒక మహిళపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం (Gang Rape) చేశారు. ప్రస్తుతం పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఇంకా ఒకరు పరారీలో ఉన్నారు. బాధిత మహిళ క్యాటరింగ్ సర్వీసెస్‌లో పనిచేస్తుందని పోలీసులు తెలిపారు. వివాహిత అయిన ఆమెకు పరిచయం ఉన్న ఓ వ్యక్తి కోరిక మేరకు హోటల్‌కు వెళ్లింది. అక్కడ మరో ముగ్గురని అతడు ఆమెకు పరిచయం చేశాడు.
Also Read : వచ్చేస్తున్న వేసవి.. గర్భిణులు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
హోటల్ లో డిన్నర్ చేశాక హోటల్ టెర్రస్‌పైకి తీసుకెళ్లి ఆమెపై దుండగులు సామూహిక అత్యాచారం చేశారు.ఈ సంఘటనను ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇంటికి చేరుకున్న బాధితురాలు జరిగిన విషయాన్ని ఆమె భర్తకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుల్లో ముగ్గురిని అరెస్ట్ చేశారు.
Also Read : రిసెప్షన్‌కు ముందు బ్యూటీపార్లర్‌కు వెళ్లొస్తానని..ప్రియుడితో జంప్ అయిన నవవధువు!
నిందితులందరూ 20 ఏళ్ల లోపు
వారిని వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. మరోకరు పరారీలో ఉండగా.. అతని కోసం గాలింపు చేపట్టారు. నిందితులందరూ వేరే రాష్ట్రానికి చెందినవారని, హోటళ్లలో పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. నిందితులందరూ 20 ఏళ్ల లోపు వారే. బాధిత మహిళ ఢిల్లీకి చెందినదని... ఆమె భర్తతో బెంగళూరులో నివసిస్తుందని పోలీసులు తెలిపారు. ఈ దంపతులకు నలుగురు పిల్లలున్నారు.
Also Read : కుంభమేళాలో డిజిటల్ స్నానం...కేవలం 1100 లే..అదిరిపోయింది కదా ఐడియా!
ఈ ఏడాది జనవరిలో బెంగళూరులోని హొయసల నగర్ ప్రాంతంలోని ఒక నిర్మాణ స్థలంలో ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి (Sexual Assault) చేసి హత్య చేశారు కొంతమంది దుండగులు. 2021–2023 మధ్య బెంగళూరులో 444 అత్యాచార కేసులు నమోదయ్యాయని కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర ఫిబ్రవరి 2024లో వెల్లడించారు.
Also Read : వంటింట్లో వాడే గరం మసాలాతో ఇన్ని లాభాలు ఉన్నాయా?