విశాఖలో దారుణం.. ఎన్‌ఆర్‌ఐ మహిళ అనుమానాస్పద మృతి

విశాఖలో ఎన్‌ఆర్‌ఐ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. అమెరికాలో స్థిరపడిన మహిళ ఓ స్థలం లీజ్ అగ్రిమెంట్ కోసం అమెరికా నుంచి వచ్చి శ్రీధర్ అనే వ్యక్తితో హోటల్‌లో ఉంటుంది. సడెన్‌గా ఆమె ఉరివేసుకుంది. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

New Update
Crime

విశాఖలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న హోటల్‌లో ఎన్ఆర్‌ఐ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. సీతమ్మధారకు చెందిన మహిళ(48) భర్త, పిల్లలతో అమెరికాలో ఉంటుంది. అయితే నగరానికి డాక్టర్ శ్రీధర్‌తో ఆమెకు స్నేహం ఏర్పడింది. అతను వైజాగ్‌లో ఓ హోటల్‌లో రూమ్ తీసుకుని ఉంటున్నాడు. ఓ స్థలం లీజ్ అగ్రిమెంట్ కోసం అమెరికా నుంచి వచ్చిన ఆ మహిళ కూడా  శ్రీధర్‌ గదిలోనే ఉంటుంది.

ఇది కూడా చూడండి: Horoscope Today: ఈ రోజు ఈ రాశి వారికి సొంత నిర్ణయాలు నష్టాన్ని తెచ్చిపెడతాయి.. జాగ్రత్త!

ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు..

ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం బాత్రూంలో ఉన్న షవర్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు శ్రీధర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాత్రాంలో ఉరి వేసుకుని చనిపోయినట్లు ఎలాంటి కారణాలు కనిపించలేదు. అయితే ఆమె ఆత్మహత్యకు చేసుకోవడానికి ముందు శ్రీధర్‌తో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె మనస్తాపానికి చెంది ఆత్మహత్య చేసుకుందా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. లేకపోతే హత్యకు గురైందా అనే విషయాలపై ఇంకా క్లారిటీ రావాలి. 

ఇది కూడా చూడండి: Lalith Modi: లలిత్ మోదీకి వనువాటు పౌరసత్వం..ఎంతకు కొన్నారో తెలుసా?

ఇదిలా ఉండగా ఏపీలో ఇటీవల ఘోరం జరిగింది. పట్టపగలే ఓ వివాహితపై దాడి జరిగింది. ముమ్మిడివరం నియోజకవర్గం అనాతవరంలో మాలతి అనే పక్కింటి మహిళపై జయ రామకృష్ణ అనే వ్యక్తి కత్తితో అటాక్ చేశాడు. మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో అమలాపురం కిమ్స్ హాస్పిటల్ కి తరలించారు. అనాతవరంలో తన ఇంటి నుంచి మాలతి బయటకు వెళ్తోంది.

ఇది కూడా చూడండి: TG News: మహిళలపై సీఎం రేవంత్ వరాల జల్లు.. ఇందిరా మహిళాశక్తి మిషన్-2025 పాలసీ ప్రకటన!

ఈ క్రమంలోనే చుట్టుపక్కల పిల్లలు అల్లరి చేస్తుండగా చిన్నగా మందలించింది. అయితే అదే సమయంలో ఇంట్లో ఉన్న జయ రామకృష్ణ పిల్లలను ఎందుకు మందలిస్తున్నావంటూ మాలతితో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరగటంతో గొడవ పెద్దదైంది. క్షిణికావేశానికి లోనైన రామకృష్ణ కోపంలో కత్తితో మాలతి‌ మెడపై దాడి చేశాడు. ఆ కత్తి దాడికి మాతలి ఎడమవైపు తల లోతుగా తెగింది. 

 

 

Advertisment
Advertisment
Advertisment