/rtv/media/media_files/2025/02/15/TZuE8wCRjwBcb1wsufaV.jpg)
accident
ఏపీలోని విశాఖలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో విశాఖ స్టీల్ సిటీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అనకాపల్లి నుంచి కూర్మన్నపాలెం బైక్ మీద ఇద్దరు వ్యక్తులు వెళ్తుండగా.. వీరి ద్విచక్రవాహనాన్ని లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. వీరు విశాఖ స్టీల్ ప్లాంట్‌లో వీరిద్దరూ ఒప్పంద కార్మికులుగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఇది కూడా చూడండి: గుడ్ న్యూస్ ..త్వరలో తండ్రి కాబోతున్న కేఎల్ రాహుల్
ఏడుగురు మృతి..
ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో బుధవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బద్నావర్-ఉజ్జయిని రోడ్డులోని బామన్సుత గ్రామ సమీపంలో రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న గ్యాస్ ట్యాంకర్ - కారు, పికప్ ట్రక్కులను - ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించగా, గాయపడిన ముగ్గురిని వెంటనే బద్నావర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రథమ చికిత్స తర్వాత, అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని రత్లాంకు తరలించారు.
ఇది కూడా చూడండి: Horoscope Today:నేడు ఈ రాశివారు కష్టపడి పని చేస్తే విజయం మీదే!
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేయడానికి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో, అధిక వేగం, ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. మృతుల్లో మందసౌర్, రత్లం మరియు జోధ్‌పూర్ నివాసితులు ఉన్నారు. ఈ ప్రమాదం కారణంగా రోడ్డుపై ట్రాఫిక్ కూడా కొంతసేపు స్తంభించిపోయింది, పోలీసులు క్రేన్ సహాయంతో వాహనాలను తొలగించి పునరుద్ధరించారు.
ఇది కూడా చూడండి: బిగ్ షాక్ ..హైదరాబాద్లో రేపు వైన్ షాపులు బంద్ !
ఇది కూడా చూడండి: Train Hijack: రైలు హైజాక్ ..ఆపరేషన్ సక్సెస్ అంటున్న పాక్ ఆర్మీ!