/rtv/media/media_files/2025/04/02/ReQnRM6dTXUc74SSfWCH.jpg)
UttarPradesh Muzaffarnagar Minor girl raped case
Rape case: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. ముజఫర్‌నగర్‌లో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపింది. తల్లికోసం రోడ్డుమీద వేసివున్న బాలికను ఇద్దరు దుండగులు అపహరించి బలవంతంగా లైంగిక దాడికి పాల్పడటం ఆడపిల్లల పేరెంట్స్‌తోపాటు స్థానికులను భయాందోళనకు గురిచేసింది. అయితే పరువుపోతుందని ఆ అమ్మాయి విషయాన్ని దాచిపెట్టగా చివరికి అనూహ్యంగా బయపడింది. ఈ దారుణానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
బలవంతంగా కారులో ఎక్కించుకుని..
ముజఫర్‌నగర్‌లో ఏప్రిల్ 1న తన తల్లి కోసం సివిల్ లైన్స్ వద్ద 16 ఏళ్ల బాలిక ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే అటువైపుగా కారులో వచ్చిన ఇద్దరు యువకులు బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. అనంతరం ఓ హోటల్‌కు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని వీడియో తీసి ఎవరికీ చెప్పొద్దంటూ బెదిరించారు. దీంతో ఆమె ఎవరకీ చెప్పలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత బాలిక అనారోగ్యం క్షిణించడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షలు నిర్వహించి లైంగిక దాడి జరిగినట్లు గుర్తించారు. దీంతో బాధితురాలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితులు రిజ్వాన్, అబజ్‌ల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చూడండి: Agniveers: అగ్నివీరులకు గుడ్‌న్యూస్.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు
ఇదిలా ఉంటే.. ఒడిశాకు చెందిన మరో వ్యక్తి భార్య వేధింపులు భరించలేక సూసైడ్ చేసుకున్నాడు. భార్య పెట్టే వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియో ద్వారా తెలిపాడు. ఒడిశాలోని ఖుర్దాలో కదులుతున్న రైలు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు ఆ వ్యక్తి వీడియో తీశాడు. నేను రామచంద్ర బర్జెనా కుంభర్‌బస్తాలో ఉంటున్నాను. నా భర్య పెట్టే వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియోలో తెలిపాడు. అయితే వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. తన భార్య కొన్ని రోజుల నుంచి రామచంద్రను మానసికంగా వేధిస్తోంది. దీనివల్ల ఇంట్లో గొడవలు అవుతున్నాయని వివరించాడు.
ఇది కూడా చూడండి: Jibli Trend: జిబ్లీలో ఫోటోలు అప్ లోడ్ చేస్తున్నారా..అయితే జాగ్రత్త
rape-case | uttar-pradesh | telugu-news | today telugu news