/rtv/media/media_files/2025/01/18/ubU9SJfeKPOCljioNOkv.jpg)
fire winter Photograph: (fire winter)
ప్రస్తుతం చలి తీవ్రత పెరిగిపోయింది. చలిని తట్టుకోలేక చాలా మంది అగ్గి మంటలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు మృతి చెందిన సంఘటనలు కూడా ఉన్నాయి. చలిని తట్టుకోలేక మంట వేసుకోవడంతో భార్యాభర్తలు మృతి చెందిన ఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది.
ఇది కూడా చూడండి: America: మారణహోమానికి మీ నిర్ణయాలే కారణం..బ్లింకన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు!
చలిని తట్టుకోలేక మంట వేయడంతో..
భిలంగానా ప్రాంతంలోని ద్వారి-థాప్లా గ్రామంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో భార్యాభర్తలు గదిలో మంట వేసుకుని నిద్రపోయారు. ఉదయం వారిని నిద్ర లేపేందుకు కుమారుడు వెళ్లి చూడగా.. శవమై కనిపిచారు. మంట పెట్టడం వల్ల గదిలో కార్బన్ మోనాక్సైడ్ వాయువు అధికం కావడంతో ఊపిరి ఆడక భార్యాభర్తలు మృతి చెందారు. తల్లిదండ్రులు చనిపోవడంతో కొడుకు కన్నీరుమున్నీరు అవుతున్నాడు.
ఇది కూడా చూడండి: budget 2025-26 బడ్జెట్‌లో మిడిల్ క్లాస్‌కు గుడ్‌న్యూస్..!
ఇదిలా ఉండగా ఇటీవల సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సూర్యాపేటలోని ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. ముందు వెళ్తున్న యోలో ప్రైవేట్ బస్సును వెనుక నుంచి వేగంగా జింగ్ ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది. స్పీడ్ బ్రేకర్ ఉండటంతో ముందు వెళ్తున్న బస్సు నెమ్మదిగా వెళ్లింది.
ఇది కూడా చూడండి: Urvashi Rautela: సైఫ్ అలీ ఖాన్ కు క్షమాపణ చెప్పిన ఊర్వశీ రౌతేలా.. సిగ్గుగా ఉందంటూ పోస్ట్
ఇది గమనించని వెనకాల బస్సు డ్రైవర్ అతివేగంగా వచ్చి ముందు బస్సును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. వెనుక బస్సు బలంగా ఢీకొట్టడంతో ముందు వెళ్తున్న బస్సు అద్దాలు పగిలిపోయాయి. దీంతో ముందు ఉండే క్లీనర్ సాయి ఒక్కసారిగా రోడ్డుపై ఎగిరి పడి మృతి చెందాడు. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న వ్యక్తి కూడా గుండె పోటుతో మృతి చెందాడు.