/rtv/media/media_files/2025/02/17/haqRSrQD0Hb3EJxKFKSl.jpg)
TG Crime
ఈ మధ్య కాలంలో యువత ఎక్కువగా బెట్టింగ్ యాప్‌లకు బలి అవుతున్నారు. తెలిసో తెలియక బెట్టింగ్ యాప్‌ల మోజులో పడి ఆస్తులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. డబ్బులు పోతే మళ్లీ సంపాదించగలరు ఏమో.. కానీ ప్రాణాలు పోతే మళ్లీ తిరిగి రావు. ఈ విషయం తెలిసినా కూడా చాలా మంది క్షణాకావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ బెట్టింగ్ యాప్‌ల బారిన పడి ఎక్కువగా యువత ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇది కూడా చూడండి: Ugadi IPhone Offers: ఉగాది ఆఫర్లు.. IPHONE 15_ 6/512జీబీ ధర భారీగా తగ్గింపు- డోంట్ మిస్!
అప్పులు కావడంతో..
ఇటీవల గద్వాల్ జిల్లాలో ఓ యువకుడు బెట్టింగ్ యాప్‌లలో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే గద్వాల్ టౌన్ కుమ్మరి వీధికి చెందిన శివ అనే 20 ఏళ్ల యువకుడు బెట్టింగ్ యాప్‌లకు బానిసగా మారాడు. బెట్టింగ్ యాప్‌లో భారీగా డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు అప్పు కూడా చేశాడు.
ఇది కూడా చూడండి: UGADI 2025: క్షణాల్లో ఉగాది పచ్చడి రెడీ .. బ్యాచిలర్స్ కూడా తయారు చేసేయొచ్చు!
ఆఖరికి స్నేహితుడు కారు తనఖా పెట్టి ఆ డబ్బులను కూడా బెట్టింగ్‌లో కోల్పోయాడు. మొత్తం డబ్బు కూడా బెట్టింగ్‌లో కోల్పోవడంతో బాగా ఒత్తిడికి గురై.. ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో కూడా ఇలానే అప్పులు చేస్తే తండ్రి తీర్చాడు. మళ్లీ అప్పులు చేయడంతో తీర్చలేక మానసిక ఆవేదన చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చూడండి: Ugadi 2025 Tv Offers: ఉగాది స్పెషల్.. బ్రాండెడ్ 4k TVలపై బ్లాక్ బస్టర్ ఆఫర్లు- వదిలారో మళ్లీ దొరకవ్!
ఇదిలా ఉండగా ఇటీవల సైబర్ నేరగాళ్ల(Cyber Criminals) చేతిలో రూ.50 లక్షలు మోసపోయిన ఓ వృద్ధ దంపతులు చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన కర్ణాటక(Karnataka)లోని బెళగావి జిల్లాలో చోటుచేసుకుంది. దియాంగో నజరత్ (83) గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకోగా, అతని భార్య ప్లేవియానా నజరత్ (79) విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని సూసైడ్ లేఖలో తెలిపారు.