/rtv/media/media_files/2025/04/08/L3vhpCThNXAPB9MiTZmR.jpg)
Rajanna siricilla Photograph: (Rajanna siricilla)
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రుద్రంగి మండలంలో ఓ తల్లి కొడుకు చపాతీలు తిన్న వెంటనే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. తల్లి కొడుకు ఇద్దరూ కూడా చికిత్స తీసుకుంటూ.. మృతి చెందారు. తల్లీకొడుకులు చనిపోవడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇది కూడా చూడండి: Today Gold Rate: కిక్కిచ్చిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా తగ్గాయ్.. తులం ఎంతంటే?
అత్తింటి వేధింపులు భరించలేక..
వీరి మృతికి పుడ్ పాయిజన్ కారణం అయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరికొందరు అత్తింటి వేధింపులు భరించలేక చనిపోయిందని మృతిరాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త చోటుచేసుకుంది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇది కూడా చూడండి: Ap Aqua -Trump Effect: ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు
ఇదిలా ఉండగా ఇటీవల బెట్టింగ్ వల్ల ఓ యువకుడు మృతి చెందాడు. కాకినాడ జిల్లా తుని రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బెట్టింగ్‌కు బానిసైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. బెట్టింగ్ వేస్తూ అప్పుల్లో కూరుకుపోయిన కొలనాటి మరణబాబు రైలు కింద పడి చనిపోయాడు. మృతుడు అనకాపల్లి జిల్లా నక్కపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్. రమణబాబు ఉద్దండపురం గ్రామంలో ఉంటూ వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నాడు.
ఇది కూడా చూడండి: Telangana: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!
సోమవారం రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రమణబాబు పూర్తిగా బెట్టింగ్‌కు బానిసై జీతం డబ్బులు కూడా ఇంటికి ఇవ్వకపోయేది. బెట్టింగ్స్ వేస్తూ అప్పులపాలైన రమణబాబు అప్పుల బాధ బరించలేక ఇక తనకు చావే దిక్కనుకున్నాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!