తెలంగాణలో విషాదం.. మరో రైతు ఆత్మహత్య

మిర్చీ పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన సూర్యాపేటలో చోటుచేసుకుంది. గణేష్ అనే రైతు ఎనిమిది ఎకరాల్లో మిర్చి, పత్తి పంటను సాగు చేశాడు. క్వింటానర మాత్రమే దిగుబడి రావడంతో పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

author-image
By Kusuma
New Update
 mother Killed nizamabad

ఎంతో కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాక చాలా మంది రైతులు దేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి విషాద ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేటలోని మోతె మండలంలో గణేష్ అనే ఓ రైతు ఉన్నాడు. ఇతనికి రెండు ఎకరాల పొలం ఉంది. దీనికి మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని, అందులో మిర్చి, పత్తి పంటను సాగు చేస్తున్నాడు.

ఇది కూడా చూడండి:  Kamal Hasan: ఆలస్యంగా రావడం వల్లే ఓటమి..20 ఏళ్ల ముందే వచ్చి ఉంటే కథ వేరేలా ఉండేది!

తక్కువ ధరకు ఎందుకు విక్రయించావని..

డబ్బులు లేకపోయినా కూడా అప్పులు చేసి మరి మిర్చి సాగుకి పెట్టుబడి పెట్టాడు. ఏడాది అంతా కష్టపడినా కూడా క్వింటాన్నర మాత్రమే దిగుబడి వచ్చింది. ఈ మిర్చిని మార్కెట్‌లో విక్రయించగా కేవలం రూ.19 వేలు మాత్రమే రైతు చేతికి అందాయి. అయితే ఇంత తక్కువ ధరకు ఎందుకు విక్రయించావని భర్తను భార్య నిలదీసింది. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగడంతో భర్త.. పొలం దగ్గర పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. 

ఇది కూడా చూడండి:Horoscope: ఈరోజు ఈ రాశివారు డబ్బు నష్టపోయే అవకాశాలున్నాయి..జాగ్రత్త!

ఇదిలా ఉండగా ఇటీవల హైదారాబాద్‌లోనూ ఓ స్కూల్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. ఉప్పల్‌లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి స్కూల్ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. బోడుప్పల్ ద్వారకా నగర్‌కు చెందిన ధర్మారెడ్డి, సంగీత దంపతుల రెండవ కుమారుడు సంగారెడ్డి ఉప్పల్ న్యూ భారత్ నగర్‌లోని సాగర్ గ్రామర్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. అయితే శనివారం ఉదయం క్లాస్ రూమ్‌లో పీటీ ఆంజనేయులు మందలించి.. కొట్టడంతో సంగారెడ్డి మనస్థాపానికి గురి అయ్యి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఇది కూడా చూడండి: MK Stalin:దేని మీద రాళ్లు రువ్వుతున్నారో గమనించుకోండంటూ స్టాలిన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Mumbai Airport: బూట్లలో కుప్పలు తెప్పలుగా బంగారం.. మొత్తం ఎన్ని కేజీలంటే?

ముంబై విమానాశ్రయంలో అక్రమంగా బంగారం తరలిస్తున్న వారిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తి బూట్లలో ఉన్న 6.7 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపుగా రూ.6.3 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

New Update
gold rates 123

Gold

ముంబై విమానాశ్రయంలో అక్రమంగా బంగారం తరలిస్తున్న వారిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విమానాశ్రయంలో ఓ వ్యక్తి బూట్లలో 6.7 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపుగా రూ.6.3 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన నిందితుడితో పాటు ఇంకొకరిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

Mumbai Airport Customs Officers Seized 6.7 Kg Gold

ఇది కూడా చూడండి: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

ఇది కూడా చూడండి: TS: భూభారతిపై అవగాహనా సదస్సులు..సీఎం రేవంత్ రెడ్డి

telugu crime news | Latest crime news | mumbai-airport | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | national news in Telugu

Advertisment
Advertisment
Advertisment