/rtv/media/media_files/2024/10/17/xuchw8Y5DVYaNLqOmuH5.jpg)
Tamilnadu
ప్రస్తుతం యువత ఎక్కువగా ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నారు. వీటి మోజులో పడి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటి దారుణమైన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని కరూర్ సమీపంలో ఓ కుటుంబం ఆన్‌లైన్ రమ్మీకు బలైంది. ప్రేమ్‌రాజ్ అనే వ్యక్తి భార్య, పిల్లలను ఇంట్లో చంపిన ఆ తర్వాత రైలు కింద పడి ఆత్యహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆన్‌లైన్ రమ్మీలో అప్పులు చేసి తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రేమ్‌రాజ్ సూసైడ్ లేఖలో రాశాడు. దీని ద్వారా పోలీసులు ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు.
ఇది కూడా చూడండి: Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో భారత్ vs న్యూజిలాండ్..దక్షిణాఫ్రికా ఇంటికి..
అదుపు తప్పి లారీ ఢీకొట్టడంతో..
ఇదిలా ఉండగా తాజాగా ఏలూరు జిల్లా సోమవరప్పాడు సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి కాకినాడు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెలర్ బస్సు అదుపు తప్పి లారీని ఢికొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్‌లోనే చనిపోగా.. 15 మందికి తీవ్ర గాయాలైయ్యాయి. వారిని హాస్పిటల్‌కు తరలిస్తున్నారు. బస్సు నడిపిన డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. వెంకటరమణ ట్రావెల్స్‌కు చెందిన బస్సుగా గుర్తించారు.
ఇది కూడా చూడండి: Railway Jobs: రైల్వేలో మరో 835 పోస్టులు.. త్వరగా దరఖాస్తు చేసుకోండి!
పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి సహయక చర్యలు చేపట్టారు. బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. క్రేన్ సహాయంతో బస్సును రోడ్డు మీద అడ్డం తొలగించారు పోలీసులు. కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదానికి కారణం ఏంటని విచారిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Mahesh Babu: SSMB29 కోసం రాష్ట్రం దాటిన మహేశ్.. ఉత్కంఠభరితమైన సన్నివేశాలపై షూట్!