/rtv/media/media_files/MkBgXhxGbbU2YycV9QdL.jpg)
hyderabad
శంషాబాద్ ఎయిర్ పోర్టులో మహిళ లోదుస్తుల్లో లైటర్లు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికురాలు అండర్‌వేర్‌లో మూడు లైటర్లు పెట్టుకుంది. ఆమె వెళ్లే సమయంలో బీప్ సౌండ్ రావడంతో మహిళా సెక్యూరిటీ అధికారులు చెక్ చేయడంతో లైటర్లు కనిపించాయి. వెంటనే పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇలాంటి వస్తువులకు విమానాల్లో అనుమతి ఉండదు.
ఇది కూడా చూడండి: భట్టి vs ఉత్తమ్ .. రేషన్ కార్డుల జారీపై మంత్రులు తలో మాట!
కనిపించకుండా మూడు లైటర్లు..
లైటర్ల వల్ల విమానంలో ఏదైనా బెదిరింపులకు పాల్పడవచ్చని పోలీసులు భావిస్తున్నారు. సిగరెట్ కాల్చడానికి అయినా కేవలం ఒక లైటర్ ఉంటే చాలు.. కానీ మూడు లైటర్లు కనిపించకుండా తీసుకెళ్లడానికి ప్రయత్నించిందనే కోణంలో ఆరా తీస్తున్నారు. పోనీ లైటర్ విలువైన వస్తువా? స్మగ్లింగ్ చేస్తుందని అనడానికి కూడా లేదు. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇది కూడా చూడండి:BREAKING: సినీ దర్శకుడు సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్.. విస్తృతంగా తనిఖీలు!
ఇది కూడా చూడండి: Stock Market Today: లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..రికార్డ్ స్థాయిలో బంగారం ధర
ఇది కూడా చూడండి:OTT Movies: ఓటీటీలో మిలియన్ల జనం చూసిన సీరీస్ లు, సినిమాలు ఇవే.. మరి మీరు చూశారా?