/rtv/media/media_files/2025/03/17/uwGXcQ1ViyolxOZriatj.jpg)
హోలీ (Holi 2025) పండగ రోజు మామకు రంగు పూయడంతో కోడలిని మందలించింది అత్త. దీంతో మనస్తాపం చెందిన కోడలు విషం తాగి ఆత్మహత్య (Suicide) చేసుకుంది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలియా జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతురాలు ధనవతిదేవి (30) హోలీ రోజున తన మామగారికి రంగు పూసింది. ఇది చూసిన ఆమె అత్తగారు ధనవతిదేవిని మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ధనవతిదేవిని వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు, అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మరణించింది. మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం కోసం పంపినట్లు సహత్వర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) దినేష్ పాఠక్ సోమవారం తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది.
Also read : బూతులతో ట్రోల్స్.. ఏడేళ్లు నరకం చూశా.. శిల్పా చక్రవర్తి వీడియో వైరల్
Also Read: బయ్యా సన్నీయాదవ్ కు బిగుసుకుంటున్న ఉచ్చు.. మరో షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్!
హోలీ వేడుకల్లో విషాదం
మరోవైపు బెంగళూరులో హోలీ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో ముగ్గురు కార్మికులు హత్యకు గురయ్యారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మద్యం మత్తులో కార్మికులు ముందుగా గొడవకు దిగారని, ఆ తర్వాత కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేసుకున్నారని పోలీసులు వెల్లడించారు. మరణించిన ముగ్గురు కార్మికులు బీహార్ నివాసితులనేని తేల్చారు. మృతులను అన్సు (22), రాధే శ్యామ్ (23), దీపు(23)గా గుర్తించారు. కార్మికులందరూ ఒకే గ్రామానికి చెందినవారని చెబుతున్నారు.
Also Read : IDY 2025 ఉత్సవానికి సన్నాహలు.. 10 ప్రత్యేకమైన కార్యక్రమాలు ప్రకటించిన ఆయుష్ మంత్రి
Also read : పిఠాపురం, మంగళగిరికి సీఎం చంద్రబాబు అదిరిపోయే శుభవార్త.. కీలక ప్రకటన!