/rtv/media/media_files/2025/04/13/X9m6ezRFc6iX3RGHbk2m.jpg)
Accident
ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివాహ వేడుక నుంచి తిరిగివస్తున్న ఓ బస్సు, ట్రక్కు వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ప్రమాద సమయంలో బస్సులో 12 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేదానిపై దర్యాప్తు చేస్తున్నారు.
#WATCH | Hapur, Uttar Pradesh | SP Gyananjay Singh says, "A bus carrying passengers, who were returning from a wedding procession, collided with a truck on the Dhaulana-Gulawati road. Police teams immediately reached the spot and investigated and began relief work. Victims were… https://t.co/k96HVS2n0Ppic.twitter.com/2zBZQLWTQb
— ANI (@ANI) April 13, 2026
Also Read: దేశంలో ఉగ్రవాదులకు పాస్ పోర్టులు, ఆధార్‌లు.. వెలుగులోకి సంచలన నిజాలు
ఇదిలాఉండగా శనివారం ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద కూడా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారుపై సిమెంట్ లారీ బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు టోల్ ఫీజు కట్టేందుకు ప్లాజా వద్ద ఆగి ఉంది. అదే సమయంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్ బ్రేకులు ఫేయిలయ్యాయి. దీంతో అది వేగంగా దూసుకొచ్చి ప్లాజా వద్ద ఉన్న కారుపై పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఏపీ, తెలంగాణ హైకోర్టుల సీనియర్ న్యాయవాది బొద్దులూరి శ్రీనివాసరావు ప్రాణాలు కోల్పోయారు.
Also Read: పంజాగుట్ట పీఎస్‌కు మంగ్లీ ...తప్పుడు ప్రచారం అంటూ ఫిర్యాదు
Follow Us