BIG BREAKING: కామారెడ్డిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గాంధారి మండలంలోని రాంపూర్ గడ్డ దగ్గర్లో కల్వర్టు వద్ద ఓ బైక్ అదుపు తప్పి పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు.

New Update
Accident

Accident

కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గాంధారి మండలంలోని రాంపూర్ గడ్డ దగ్గర్లో కల్వర్టు వద్ద ఓ బైక్ అదుపు తప్పి పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. గాంధారి వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధితుల తల, ముఖంపై తీవ్రంగా గాయాలు కావడంతో వాళ్లు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. మృతులను ముఖియా (21), రాహుల్ (21), జావీద్ (22)గా గుర్తించారు. ఈ ముగ్గురు కూడా బిహార్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వాళ్లుగా గుర్తించారు. వీళ్లు రాంపూర్ గడ్డ వద్ద ఓ రైస్‌మిల్లులో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. 

Also Read: విజయవాడలో దారుణం.. యువతిపై ఆటో డ్రైవర్‌ అత్యాచారం

మరోవైపు చిత్తూ జిల్లాలో కూడా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.  పలమనేరు నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. శేషాపురం సర్వీస్ రోడ్డు వద్ద ఆగి ఉంది. ఇదే సమయంలో ఈ రూట్‌లో వేగంగా వచ్చిన కారు ఆగి ఉన్న బస్సును ఢీకొంది. కారులో ఉన్నవారికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. 

Also Read: తాడిపత్రిలో కాల్పుల కలకలం..నిందితుడిపై పోలీసుల ఫైరింగ్‌..ఎందుకంటే?

Advertisment
తాజా కథనాలు