/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Crime-News-2.jpg)
rape
రాజస్థాన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్కూల్‌కు వెళ్తున్న ఓ బాలికపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. లోడీలో ఓ బాలిక కుటుంబంతో కలిసి ఉంటుంది. ఉదయం స్కూల్‌కి వెళ్తున్న సమయంలో ఆమెను ముగ్గురు నిందితులు కిడ్నాప్ చేసి ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.
ఇది కూడా చూడండి: ఖేల్ రత్న అవార్డ్‌లు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము
స్కూల్‌కు రాలేదని ఫిర్యాదు చేయడంతో..
ఇంతలో బాలిక స్కూల్‌కు రాలేదని ఉపాధ్యాయులు తండ్రికి కాల్ చేసి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తండ్రి వెంటనే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసి వస్తుండగా రోడ్డు పక్కన ఆ బాలిక అపస్మారక స్థితిలో కనిపించింది. భారతీయ న్యాయ సంహితలోని పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితుల్లో ఇద్దరు తప్పించుకోగా..ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చూడండి: Saif Ali Khan: సైఫ్ ను పొడిచిన కత్తి ఇదే.. ఎంత లోతు దిగిందంటే?
మరో ఘటన..
ఇదిలా ఉండగా ఇటీవల ఏపీలో పెను విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఒమ్మంగి శివారులో ఘోర ప్రమాదం జరిగింది. అదుపు తప్పి కాలువలో మినీ వ్యాన్ పడిపోవడంతో స్పాట్‌లోనే ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు
ఇది కూడా చూడండి: Arvind Kejriwal: ప్రధానిమోదీకి కేజ్రీవాల్ సంచలన లేఖ.. ఏం చెప్పారంటే ?
స్థానికులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పండుగ నేపథ్యంలో కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఓ వాటర్ ఫాల్స్‌కి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాద సమయంలో వ్యాన్‌లో మొత్తం 20 మంది కుటుంబ సభ్యులు ఉన్నట్లు సమాచారం.