/rtv/media/media_files/2025/04/09/STKlbz1tO95ugpZJ5l9y.jpg)
Parents killing children for illicit relations
Crime story: దేశంలో తల్లిదండ్రుల క్షణికావేశానికి బలవుతున్న పిల్లల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. విహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని ఒకరు.. భర్త ప్రేమను పంచట్లేదని మరొకరు.. చదువులో వెనకబడ్డారని ఇంకొకరు.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని మరొకరు. ఇలా కారణాలేవైనా పేరెంట్స్ తీసుకుంటున్న నిర్ణయాలకు ముక్కుపచ్చలారని చిన్నారులు బలవుతూనే ఉన్నారు.
ముగ్గురు పిల్లలు కానరానిలోకాలకు..
తమిళనాడు పుదుకోట్టైలో తల్లి కసాయిగా మారింది. ఐదు నెలల చిన్నారిని నీళ్ల డ్రమ్ములో ముంచి చంపేసింది. భర్త తనపై కాకుండా తమకు పుట్టిన బిడ్డతో ప్రేమగా ఉంటున్నాడని కడతేర్చింది. మరో కేసులో ఓ తల్లి ప్రియుడితో కలిసి ఉండేందుకు పిల్లలకు విషమిచ్చింది. రాత్రి భోజనంలో విషం కలిపి ముగ్గురు పిల్లలను కానరాని లోకాలకు పంపించింది. ఈ ఘటన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో జరిగింది.
Also Read: TG Crime: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!
కాళ్లు చేతులు కట్టేసి..
కాకినాడలో ఓ తండ్రి కన్నబిడ్డల పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. చదువులో వెనకబడ్డారని ఇద్దరు పిల్లల జీవితాలను చిదిమేశాడు. కాళ్లు చేతులను తాళ్లతో కట్టి బకెట్లో ముంచి ఊపిరి తీశాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక హైదరాబాద్ హబ్సిగూడలో ఆర్థిక ఇబ్బందులతో ఫ్యామిలీ బలవన్మరణానికి పాల్పడింది. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. పేరెంట్స్ ఉరేసుకుని చనిపోయారు.
తప్పు వారిదైనా శిక్ష పిల్లలకే..
తల్లిదండ్రుల ఒత్తిడి, క్షణికావేశం..ఇలా కారణాలు ఏవైనా పేరెంట్స్ తీసుకునే నిర్ణయాలతో అభంశుభం తెలియని చిన్నారులు బలవుతూనే ఉన్నారు. తప్పు తల్లిదైనా.. తండ్రిదైనా శిక్ష మాత్రం పిల్లలు అనుభవిస్తున్నారు. ఎన్నోఏళ్ల జీవితాన్ని చూడాల్సిన చిన్నారులు చిన్నతనంలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికైనా తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయాలు పిల్లల ప్రాణాలను తీసేలా ఉండకూదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
childrens | telugu-news | parents