ఎన్టీఆర్ జిల్లాలో దారుణం.. బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం

ఎన్టీఆర్‌ జిల్లాలో బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం చేసిన దారుణ ఘటన జరిగింది. ఓ యువకుడు మాయ మాటలు చెప్పి బలవంతంగా ఆమెపై అత్యాచారం చేసి ఫొటోలు తీశాడు. ఆ తర్వాత స్నేహితులకు చూపించి బెదిరింపులకు పాల్పడ్డాడు. యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

New Update
Guntur crime

NTR crime Photograph: (Guntur crime)

ఎన్టీఆర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కంచికర్లలోని ఇంజినీరింగ్‌ కాలేజీలో ఓ విద్యార్థిని చదువుతోంది. ఈమెకు పరిటాలకు చెందిన గాలి సైదాతో స్నేహం ఏర్పడింది. దీన్ని ఆసరాగా తీసుకున్న ఆ యువకుడు మాయమాటలు చెప్పి బలవంతంగా ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ సమయంలో బలవంతంగా నగ్న ఫొటోలు కూడా తీశాడు.

ఇది కూడా చూడండి: Sankranthiki Vasthunam: వెంకీ మామ ఫ్యాన్స్ గెట్ రెడీ.. యూట్యూబ్ లో 'గోదారి గట్టు మీద' సాంగ్ ఫుల్ వీడియో

ఫొటోలతో ఆ యువతిని బెదిరించి..

ఆ ఫొటోలను యువకుడు స్నేహితులకు చూపించి బెదిరింపులకు పాల్పడ్డారు. స్నేహితులు కూడా ఆమెను బెదిరించడం మొదలు పెట్టారు. ఆ వేధింపులు భరించలేక యువతి పోలీసులను ఆశ్రయించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇది కూడా చూడండిPakistan PM : పరువు తీయొద్దు .. భారత్ పై గెలవండి..కప్ తీసుకురండి :  పాక్ ప్రధాని

 ఇదిలా ఉండగా ఇటీవల ఓ ప్రభుత్వ టీచర్ తల్లి, కూతుళ్లపై అత్యాచారానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రభుత్వ టీచర్ (Government Teacher)ఒక మహిళతో సహజీవనం చేస్తూనే.. మరోవైపు ఆమె కూతుళ్లపై పై కూడా  హత్యాచారానికి తెగబడ్డాడు. తల్లికి తెలియకుండా రెండేళ్ల నుంచి ఆమె కూతుళ్లపై హత్యాచారానికి  పాల్పడుతూ ఉన్నాడు. ఇంతలో అతడికి  HIV పాజిటివ్ అని తేలింది. దీంతో అన్ని విషయాలు బయటపడ్డాయి. కూతుళ్లపై కూడా అత్యాచారం చేస్తున్నాడని తెలుసుకున్న సదరు మహిళా  ఆ కామాంధుడిని పోలీసులకు పట్టించింది.  ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో శనివారం వెలుగు చూసింది. 

ఇది కూడా చూడండి: Mastan sai: టాలీవుడ్ To పాలిటిక్స్ ఎవరిని వదలని మస్తాన్ సాయి: టోటల్ లిస్ట్ ఆడియో వైరల్!

 

ఇది కూడా చూడండి: Fake Gold: షాపు ఓనర్కు  మస్కా :  నకిలీ బంగారం తాకట్టు పెట్టి..  అసలు బంగారంతో పరార్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Crime: రైస్ మిల్‌లో విషాదం.. కరెంట్ షాక్‌తో ముగ్గురు మృతి!

ఏపీలో ఘోర విషాదం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలోని సూర్య మహాలక్ష్మి రైస్ మిల్లులో విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి చెందారు. మృతులు కాపవరం గ్రామానికి చెందిన శ్రీరాములు, అన్నవరం, వెంకన్నగా పోలీసులు గుర్తించారు. మిల్ యజమానిపై కేసు నమోదు చేశారు.

New Update
rice mill

East Godavari rice mill lectric shock issue

AP Crime: ఏపీలో ఘోర విషాదం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలోని సూర్య మహాలక్ష్మి రైస్ మిల్లులో విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి చెందారు. మృతులు కాపవరం గ్రామానికి చెందిన శ్రీరాములు, అన్నవరం, వెంకన్నగా పోలీసులు గుర్తించారు.

ట్రాలీలో రైస్ తీసుకొస్తుండగా..

ఈ మేరకు కోరుకొండ ఎంపీడీవో ఆఫీస్ వెనక రైస్ మిల్ లోకి శనివారం ఉదయం గోడౌన్ నుండి రైస్ ను ట్రాలిలో రైస్ తీసుకుని వస్తుండగా విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో అక్కడికక్కడే మృతులు ఆకుల శ్రీరాములు (34), పలసాని అన్నవరం (55),జాజుల వెంకన్న (46) చనిపోయారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణ.. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఇస్తామని తెలిపారు. మృతిపై సమగ్ర విచారణ జరిపి రైస్ మిల్ యజమాన్యంపై, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బలరామకృష్ణ  తెలిపారు.

ఇది కూడా చూడండి: TG Crime: సిరిసిల్లలో ఘోరం.. తొగొచ్చి తండ్రిని కొట్టి చంపిన కొడుకు!

బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వం తరఫున రావాల్సిన నష్టపరిహారాన్ని చనిపోయిన మృతుల కుటుంబాలకు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. యాజమాన్యం నిర్లక్ష్యం పైన, ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి మార్చుకోవాలని, విద్యుత్ అధికారులు వైర్లు కిందకు ఉన్నా పట్టించుకోకపోవడం తో ఈ ప్రమాదం జరిగిందని బాధిత కుటుంబాలు తమముందు కన్నీటి పర్యాంతమయ్యారు. చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం తరఫునుంచి ఆదుకోవాలని, వైసీపీ తరఫునుంచి కూడా బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని వారిని ఆదుకుంటామని  మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని ఇలాంటి ఘటన మళ్లీ పునరవృతం కాకుండా ప్రభుత్వం ఇప్పటికైనా సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు.

ఇది కూడా చూడండి: Brain Health: ఈ అలవాట్లు వెంటనే మానెయ్ లేదంటే బ్రెయిన్ షెడ్డుకే..!

 rice | power | shock | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు