/rtv/media/media_files/2025/04/11/EY7JkYQ7hPIwam0YUwrw.jpg)
Nalgonda Saligauraram Musi Vagu murder case
TG Crime: మూసీవాగులో ఓ యువతి మృతదేహం లభించడం సంచలనం రేపుతోంది. శాలిగౌరారం వంగమర్తి గ్రామం వాగులో పోలీసులు వెలికితీసిన డెడ్ బాడీని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి పాతిపెట్టినట్లు గుర్తించారు. మృతురాలిది జనగామ జిల్లా పడమటి తండాకు చెందిన జటావత్ మహేశ్వరిగా నిర్ధారించారు. అయితే ఈ కేసు విచారణలో భయంకర నిజాలు బయటపడ్డాయి. తల్లే చంపినట్లు తెలియడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.
ఏఆర్ కానిస్టేబుల్ సహాయంతో హత్య..
ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనా నాయక్ మొదటి భార్య కూతురు మహేశ్వరి. అయితే ఈనా నాయక్ కొంతకాలం క్రితం లలిత అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల మహేశ్వరికి పెళ్లి సంబంధం కుదిర్చిన ఈనా.. కోటి రూపాయల విలువ చేసే ఇంటిని కట్నం కింద ఇస్తానని ఒప్పుకున్నాడు. దీంతో ఆ ఇళ్లు తనకే కావాలని భావించిన లలిత.. తన మేనబావ అయిన ఏఆర్ కానిస్టేబుల్ సహాయంతో 2024 డిసెంబర్ లో మహేశ్వరిని చంపేసింది. అనంతరం కానిస్టేబుల్ సహాయంతో వంగమర్తి దగ్గర మూసీ వాగులో పాతిపెట్టింది.
Also Read: ఇదొక విచిత్రమైన లవ్ స్టోరీ.. ఫ్యాన్ రిపేర్ కోసం వచ్చి పాపను పడేశాడు!
అయితే తండ్రి మిస్సింగ్ కేసు పెట్టగా.. తాజాగా శాలిగౌరారం వంగమర్తి గ్రామం వాగులో డెడ్ బాడీ లభించడం కలకలం రేపింది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత ఆమె స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఆస్తి కోసమే మహేశ్వరిని హతమార్చినట్లు లలిత అంగీకరించింది. ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ హత్యకు సహకరించిన వారికోసం పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
Also Read: స్కూల్ బ్యాగ్‌లో కండోమ్స్, తంబాకు ప్యాకెట్లు, కత్తులు, అగ్గిపెట్టలు.. ఎవర్రా మీరంతా!
mother | killed | daughter | today telugu news