Mumbai Bomb Threats: మరోసారి బాంబు బెదిరింపులు.. పాఠశాలకు మెయిల్

ముంబై స్కూల్‌కు బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. అంధేరీలోని ర్యాన్ గ్లోబల్ స్కూల్‌కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో పోలీసులు, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది పాఠశాలను పరిశీలించారు. ఎలాంటి వస్తువులు దొరకలేదు.

New Update
delhi schools

Mumbai Bomb Threats

Mumbai Bomb Threats: ముంబైలో బాంబు బెదిరింపు మెయిల్స్ కలకలం రేపుతున్నాయి. ముంబైలోని ఓ పాఠశాలకు మళ్లీ బాంబు బెదిరింపులు వచ్చాయి. అంధేరీలోని జోగేశ్వరి-ఓషివారా ప్రాంతంలోని ర్యాన్ గ్లోబల్ స్కూల్‌కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో వెంటనే స్థానిక పోలీసులు, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది రంగంలోకి దిగారు. పాఠశాల ఆవరణాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అదృష్టవశాత్తు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. దీంతో పాఠశాల యాజమాన్యం కాస్త ఊపిరి పీల్చుకున్నారు. 

ఇది కూడా చూడండి: Meerpet Incident:'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా చూపించి.. భార్యను కుక్కర్లో ఉడికించి చంపిన భర్త!

ఇది కూడా చూడండి: TG Schools: ప్రైవేట్ బడుల్లో వారికి ఉచిత చదువులు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!

ఈ ఏడాదిలో పలు స్కూళ్లు..

ఇదిలా ఉండగా.. గతేడాది జనవరిలో ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌కు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ ఏడాది ఢిల్లీలోని స్కూళ్లు(Delhi Schools), విమానాశ్రయాలకు(Delhi Air Ports) కూడా బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఆఖరికి ఆర్‌బీఐ ప్రధాన కార్యాలయానికి(RBI Head Office) కూడా ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. 

ఇది కూడా చూడండి: Crime: ఈ కుక్కర్లోనే ఉడికించి.. ఫినాయిల్‌ తో కడిగి: వెలుగులోకి భయంకర నిజాలు!

ఇది కూడా చూడండి: Meerpet Incident: 72 గంటలు భార్య శవాన్ని ఉడికించి.. ఆరబెట్టి పొడిచేసి.. ఇదొక భయంకరమైన హత్య!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tractor accident: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

వ్యవసాయ కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పి బావిలో పడింది. ఏడుగురు మహిళలు మృతి చెందగా.. ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఈ విషాదం శుక్రవారం జరిగింది. మృతుల కుటుంబాలకు CM రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

New Update
tractor accident in MH

tractor accident in MH

కూలీలు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బావిలో పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళా కూలీలు మరణించగా.. మరో ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. అసే గ్రామంలోని వ్యవసాయ క్షేత్రానికి మహిళా కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పింది. అక్కడున్న వ్యవసాయ బావిలో అది పడింది. అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. బావిలో పడిన ట్రాక్టర్‌తోపాటు ట్రాలీని క్రేన్‌ సహాయంతో బయటకు తీశారు.  

Also read: KCR: సుప్రీం కోర్టు ముందు తెలంగాణ పరువు తీశారు

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మోటారు పైపులతో నీటిని తోడారు. క్రేన్స్‌ను రప్పించి సహాయక చర్యలు చేపట్టారు. బావిలో పడిన ట్రాక్టర్‌తోపాటు ట్రాలీని బయటకు తీశారు. ఏడుగురు మహిళా కూలీల మృతదేహాలను వెలికితీశారు. ముగ్గురు మహిళలను రక్షించారు. మరమణించిన ఏడుగురు మహిళలు హింగోలి జిల్లాలోని గుంజ్ గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. మహారాష్ట్ర సీఎం కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

Also read: PM Modi: ప్రధాని మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ

Advertisment
Advertisment
Advertisment